టీఆర్ఎస్ లో చేరేందుకు ఎల్ రమణ సానుకూలత.. తెలంగాణ టీడీపీ ఖాళీ అయినట్టేనా?

-

తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు. కానీ, తాజాగా ఎల్ రమణ ఈ విషయమై మాట్లాడారు. తెలంగాణలో అధికారంలో ఉన్న ప్రభుత్వం నుండి తనకు పిలుపు వచ్చిందని, ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై మిత్రులతో, శ్రేయోభిలాషులతో చర్చిస్తున్నామని, ఖచ్చితంగా సానుకూల నిర్ణయమే ఉంటుందని తెలియజేస్తున్నామని ప్రకటించారు.

ఎల్ రమణ సానుకూలత వ్యక్తం చేయడంతో తెలంగాణ టీడీపీ వర్గాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తుంది. తెలంగాణలో టీడీపీ ఖాళీ అయినట్టే అని వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్కొక్కరుగా వేరే పార్టీల్లోకి మారుతుండడంతో తెలంగాణ టీడీపీ ఖాళీ అవుతుందని, రాజకీయంగా భవిష్యత్తు బాగుండాలంటే వేరే పార్టీలోకి మారాల్సిందే అని చెప్పుకుంటున్నారు. మరి తెలంగాణలో టిడీపీ పరిస్థితి ఏంటనేది మరికొన్ని రోజులు ఆగితే పూర్తిగా తెలిసిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news