దేశంలో కొత్త కరోనా కేసులు ఎన్నో తెలుసా?

-

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.. గడిచిన 24 గంటల్లో 43 వేల 393 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. నిన్నటితో పోల్చితే 5.4 శాతం తక్కువగా కేసులు నమోదు అయినట్లు పేర్కొంది. దేశంలో ఇప్పటివరకూ 3 కోట్ల 7 లక్షల 52 వేల 950 మందికి కరోనా సోకింది. ఇందులో 2 కోట్ల 98 లక్షల 88 వేల 284 మంది చికిత్స పొంది కోలుకున్నారు.

ప్రస్తుతం 4 లక్షల 58 వేల 727 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తం 4 లక్షల 5 వేల 939 మంది కరోనా సోకి మృతి చెందారు. గురువారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 44 వేల 459 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. గత 24 గంటల్లో మొత్తం 911 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. గత 24 గంటల్లో 40 లక్షల 23 వేల 173 డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకూ మొత్తం 36 కోట్ల 89 లక్షల 91 వేల 222 మంది వ్యాక్సిన్లు వేయించుకున్నారని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news