బెంగళూరులో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే రేవ్ పార్టీ నిర్వహించారని తెలుస్తోంది. ఈ రేవ్ పార్టీలో రాజకీయ పార్టీ నాయకులు, సీనీ తారలు పాల్గొన్నారని సమచారం. ఇక ఈ రేవ్ పార్టీపై సీసీబీ పోలీసులు దాడి చేశారు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు పోలీసులు. ఈ పార్టీలో డ్రగ్స్ MDMA మరియు కొకైన్ గుర్తించారట.
ఆంధ్రా, బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా పార్టీలో దొరికిపోయారని సమాచారం. పార్టీలో 25 మందికి పైగా యువతులు దొరికిపోయారని… బర్త్‌డే పేరుతో పార్టీ పెట్టారని సమాచారం. సీసీబీలోని యాంటీ నార్కోటిక్స్ విభాగం అధికారులు దాడి చేశారు… ఎలక్ట్రానిక్ సిటీలోని జీఆర్ ఫామ్స్ హౌస్ లో ఈ పార్టీ జరిగిందని చెబుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన వాసు పార్టీ ఏర్పాటు చేశారని… బెంజ్ కారులో ఆంధ్రా ఎమ్మెల్యే పాస్‌పోర్ట్ దొరికిందని తెలుస్తోంది.ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరిట పాస్‌పోర్టు దొరికిందని… ఘటనా స్థలంలో పదిహేనుకు పైగా కార్లు లభ్యమయ్యాయట.