ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగలబోతోంది. కమ్మ సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న రాయపాటి సాంబశివరావు ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు జిల్లాలో ప్రచారం జరుగుతుంది.. 2014లో నరసరావుపేట ఎంపీగా పోటీ చేసిన రాయపాటి సాంబశివరావు.. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు నేపథ్యంలో టిడిపి తో టచ్ మీ నాట్ అన్నట్లు ఉన్నారు.
అయితే తన కొడుక్కి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని అధినేత చంద్రబాబు దగ్గర ప్రతిపాదన పంపినప్పటికీ ఆయన పట్టించుకోవట్లేదు అనే ఆవేదన రాయపాటి సాంబశివరావు బలంగా ఉందట.. దానికి తోడు ఆయనకు చిరకాల శత్రువుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు టిడిపిలో ప్రాధాన్యత లభించడం రాయపాటి జీర్ణించుకోలేకపోతున్నారని ఉమ్మడి గుంటూరు జిల్లాలో టాక్ నడుస్తుంది.. టిడిపి కావాలని తమ కుటుంబాన్ని దూరం పెడుతుందని.. తన కొడుకు రంగబాబు కు టికెట్ ఇవ్వాలని అడిగినప్పటికీ చంద్రబాబు పట్టించుకోవటం లేదని.. రాయిపాటి తన అనుచరుల వద్ద ప్రస్తావించారట.. ఈ క్రమంలోనే వైసీపీ నేతలతో ఆయన టచ్ లోకి వెళ్లారని తెలుస్తుంది..
రాయపాటి ఫ్యామిలీని టిడిపి దూరం పెడుతూ ఉండంతో ఆయన వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారు.. ఇప్పటికే పళ్ళు తపాలు వైసీపీ పెద్దలతో రాయపాటి సాంబశివరావు మంతనాలు జరిపారని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
సత్తెనపల్లి టికెట్ ఇస్తే కన్నా లక్ష్మీనారాయణ పై పోటీ చేసి.. అతన్ని ఓడిస్తామని.. తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని సాంబశివరావు వైసీపీ పెద్దలకీ ప్రతిపాదన పంపారట.. దీనిపై వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పొలిటికల్ సర్కిల్లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.. మరోపక్క సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతున్నారు.. ఈ క్రమంలో సత్తెనపల్లి టికెట్టు సాంబశివరావు ఫ్యామిలీకి వచ్చే అవకాశాలు లేదని వైసిపి పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. కమ్మ సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న రాయపాటి సాంబశివరావు ఒకవేళ వైసీపీలోకి వెళ్తే మాత్రము టిడిపికి పెద్ద డ్యామేజ్ అని చెప్పుకోవాలి..