అమరావతి లో అడుగు కూడా పెట్టకుండా బాలయ్య ని అడ్డుకుంది ఎవరు ?

181

తెలుగుదేశం పార్టీ నాయకులు కుటుంబాలు మొత్తం ఇప్పుడు అమరావతి ప్రాంతంలో నిరసనలు దీక్షలలో పాల్గొంటున్నాయి. చంద్రబాబు నాయుడు మరియు ఆయన కుటుంబ సభ్యులు సంక్రాంతి పండుగ రోజు కూడా అమరావతి ప్రాంతంలో రైతులు చేస్తున్న దీక్షలో పాల్గొని సీఎం వైఎస్ జగన్ తీసుకున్న వికేంద్రీకరణ అంశం పై తీవ్రమైన వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ అమరావతి ప్రాంతం నుండి రాజధాని ని తొలగించే కార్యక్రమం సీఎం జగన్ చేపట్టారని ప్రసంగాలతో దంచి కొట్టాడు చంద్రబాబు.

Image result for political balakrishna

అయితే ఇటువంటి నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో అందరూ పర్యటించిన గాని ఇప్పటివరకు హిందూపురం ఎమ్మెల్యే చంద్రబాబు బామ్మర్ది బాలకృష్ణ రాకపోవడం పట్ల అనేక విమర్శలు రావడంతో తాజాగా బాలకృష్ణ అమరావతి ప్రాంతంలో పర్యటించడానికి రెడీ అయిన సందర్భంలో ఆఖరి నిమిషంలో పర్యటన రద్దు కావడం ఇప్పుడు ఏపీ మీడియా వర్గాల్లో మరియు తెలుగుదేశం పార్టీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

మేటర్ లోకి వెళితే బాలకృష్ణ అమరావతి పర్యటన చివరి నిమిషంలో వాయిదా పడటానికి గల కారణాలలో పవన్ కళ్యాణ్ బీజేపీతో కలవడంతో ఏపీలో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మార్పు రావడంతో బిజెపి తో జనసేన పొత్తు నేపథ్యంలో రాజధాని విషయంలో వాళ్ల నిర్ణయం కూడా వెల్లడి చేశాక అప్పుడు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తే బాగుంటుందనే ఆలోచనలో బాలకృష్ణ ఉన్నట్లు ఏపీ మీడియా వర్గాల వినబడుతున్న టాక్. మొత్తంమీద చూసుకుంటే పవన్ కళ్యాణ్ బీజేపీతో చేతులు కలపడంతో బాలకృష్ణ అమరావతి పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.