రెడ్డి వర్సెస్ రెడ్డి: ఫ్యాన్ లీడ్‌ని సైకిల్ తగ్గిస్తుందా?

-

అధికార వైసీపీలో రెడ్డి సామాజికవర్గం హవా, టీడీపీలో కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అందుకే ఏపీలో ఈ రెండు వర్గాలే మధ్యే వార్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఏపీలో రెడ్డి వర్గం హవా స్పష్టంగా ఉంది. ఎందుకంటే వైసీపీలో రెడ్డి వర్గం ఎమ్మెల్యేలే ఎక్కువ. ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు

ysrcpandtdp
ysrcpandtdp

అసలు గుంటూరు, ప్రకాశం మినహా మిగిలిన జిల్లాల్లో రెడ్డి ఎమ్మెల్యేలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మిగిలిన వర్గాలతో పోలిస్తే రెడ్డి ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ. అయితే రెడ్డి ఎమ్మెల్యేలని నిలువరించగలిగితేనే వైసీపీకి చెక్ పెట్టగలరు. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు…రెడ్డి వర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వారికి చెక్ పెట్టడానికి సరికొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని నియోజకవర్గాల్లో రెడ్డి ఎమ్మెల్యేలకు చెక్ పెట్టడానికి టీడీపీ నుంచి రెడ్డి నేతలనే నిలబెట్టడానికి సిద్ధమవుతున్నారు.

మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చెక్ పెట్టడానికి జూలకంటి బ్రహ్మరెడ్డిని పోటీగా పెట్టారు. సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డికి అపోజిట్‌లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిపై కాటంరెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డి నిలబడనున్నారు. ఇక పీలేరులో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిపై నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, శ్రీకాళహస్తిలో మధుసూదన్ రెడ్డిపై బొజ్జల సుధీర్ రెడ్డి, పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చల్లా రామచంద్రరెడ్డిలు బరిలో దిగనున్నారు.

అటు తాడిపత్రిలో పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి, పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డిపై పల్లె రఘునాథ్ రెడ్డి పోటీ చేయనున్నారు. బనగానపల్లెలో కాటసాని రామిరెడ్డిపై బీసీ జనార్ధన్ రెడ్డి…పాణ్యంలో కాటసాని రామ్ భూపాల్ రెడ్డిపై గౌరు చరితా రెడ్డి పోటీ చేస్తారు. ఇలా ఎక్కడకక్కడ రెడ్డి ఎమ్మెల్యేలకు చెక్ పెట్టడానికి టీడీపీ నుంచి కూడా రెడ్డి నేతలే రంగంలోకి దిగనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news