ఎన్నికల బరిలో మాజీ ఐఏఎస్.. కన్ఫామ్ చేసే సీఎం జగన్..

-

నిన్న మొన్నటి వరకు పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్న ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ఉద్యోగానికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఆయన వాలంటీ రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించారు.. అయితే దీని వెనక వైసిపి వ్యూహం ఉన్నట్లు పార్టీలో ప్రచారం నడుస్తుంది..

రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఇంతియాజ్ను బరిలోకి దింపాలని వైసీపీ అధిష్టానం భావిస్తుందట.. గత ఎన్నికల్లో ఎక్కడి నుంచి హాఫిజ్ ఖాన్ పోటీ చేసి గెలుపొందారు.. అయితే ఈసారి కొత్త ముఖాలను అసెంబ్లీకి పంపాలని జగన్ భావిస్తున్న నేపథ్యంలో.. ముస్లిం మైనారిటీ అధికారుల్లో ఒకరైన ఇంతియాజ్ వైపు సీఎం జగన్ మొగ్గు చూపారట.. రాజకీయాల్లోకి రావాలని ఆయన్ని ఆహ్వానించడంతో ఇంతియాజ్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారని సీఎంఓ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వైసీపీలోకి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఇంతియాజ్ ను గెలిపించేలా కర్నూలు జిల్లా నేతలకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారట.

కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్నారు.. వారందరూ వైసిపి వైపే ఉండడంతో.. కొత్త అభ్యర్థిని బరిలోకి దింపితే అక్కడ ఖచ్చితంగా గెలవచ్చని వైసిపి వర్గాలు భావించాడట.. దీంతో వివాదరహితుడుగా పాలన వ్యవహారాల్లో అనుబోగ్నుడిగా ఉన్న ఇంతియాజ్ అహ్మద్ను అక్కడి నుంచి బరిలోకి దింపాలని వైసీపీ భావించింది.. ఇందుకోసం ఆయన్ని రాజకీయాల్లోకి ఆహ్వానించిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కూడా ఇంతియాజ్ రాకను స్వాగతించారని.. ఆయన గెలుపు కోసం కృషి చేస్తానని జగన్మోహన్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు కర్నూలు నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది.. రాజకీయాలతో సంబంధం లేని ఐఏఎస్ అధికారులను సైతం జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించి.. టికెట్ ఇస్తుండటం పై మేధావులు రాజకీయ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారట..

Read more RELATED
Recommended to you

Latest news