మునుగోడులో రేవంత్ తిప్పలు..ఆ ఓట్లు వస్తే చాలు..!

-

రెండు టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు…రెండు బీజేపీకి ఇచ్చారు..ఈ ఒకటి మాత్రం తమకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి…మునుగోడు ప్రజలని బ్రతిమలాడుకుంటున్నారు. హుజూర్‌నగర్. నాగార్జునస్ సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచింది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మాత్రం ప్రజలు అవకాశం ఇవ్వలేదు. అందుకే మునుగోడులో అవకాశం ఇవ్వాలని రేవంత్ కోరుతున్నారు.

తమ సిట్టింగ్ సీటు అయిన మునుగోడులో పార్టీని గెలిపించుకోవడం కోసం రేవంత్ తెగ కష్టపడుతున్నారు. ఇప్పటికే పాల్వాయి స్రవంతిని అభ్యర్ధిగా ప్రకటించారు. తాజాగా ఆమెకు మద్ధతుగా రేవంత్ సమావేశం ఏర్పాటు చేసి…మునుగోడు ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. మీ పాదాలకు నమస్కరించి అడుగుతున్నా…మునుగోడులో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రేవంత్ వేడుకుంటున్నారు. అంటే ఏ స్థాయిలో రేవంత్ వేడుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఎలాగైనా మునుగోడులో గెలిచి తీరాలని రేవంత్ చూస్తున్నారు.

అలాగే సెప్టెంబర్ 18 నుంచి మునుగోడులో ఎన్నికల ప్రచారం చేయడానికి రేవంత్ సిద్ధం అయ్యారు. ఇక రాష్ట్ర నేతలు సైతం మునుగోడులో పార్టీ గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి పడిన ఓట్లు..ఇప్పుడు మళ్ళీ పడితే ఈజీగా గెలిచేస్తామని రేవంత్ లెక్కలు వేసుకుంటున్నారు. అలాగే మునుగోడులో కాస్త బలంగా ఉన్న కమ్యూనిస్టు ఓటర్లని సైతం రేవంత్ సపోర్ట్ ఇవ్వమని అడుగుతున్నారు. ఇప్పటివరకు కమ్యూనిస్టు పార్టీలని దగ్గరకు రాని, కేసీఆర్ ఇప్పుడు ఎందుకు దగ్గరకు తీసుకున్నారో అర్ధం చేసుకోవాలని మునుగోడు కమ్యూనిస్టు కార్యకర్తలని కోరుతున్నారు.

ఇటు రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ…మునుగోడులో మొత్తం 294 బూతులు ఉన్నాయని…ఒకో బూతులో 254 ఓట్లు వస్తే చాలు అని, అలాగే 76 వేల ఓట్లు పడితే గెలుపు తమదే అని అంటున్నారు. మొత్తానికి మునుగోడులో గెలవడం కోసం కాంగ్రెస్ నేతలు గట్టిగానే కష్టపడుతున్నారు. మరి మునుగోడు ఫలితం ఏం అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news