టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి…? తెలంగాణ కాంగ్రెస్ లో త్వరలో అనూహ్య మార్పులు.. హైకమాండ్ ఆలోచనేంటి?

-

ఇప్పుడు దాదాపుగా అన్ని ఎన్నికలు పూర్తయి రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ఈ సమయంలోనే పార్టీలో కీలక మార్పులు చేయనున్నట్టు పార్టీ హైకమాండ్ భావిస్తోంది. కీలక మార్పుల్లో తొలి అడుగు పీసీసీ చీఫ్ ను మార్చడమేనట.

అటు కేంద్రంలోనూ ఇటు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ చతికిలపడిపోయింది. ఏదో రెండుమూడు రాష్ట్రాల్లో తప్పితే కాంగ్రెస్ ఇప్పుడు ఎక్కడా అధికారంలో లేదు. ఎటువంటి పార్టీ ఎలా అయిపోయింది. సరే.. ఇతర రాష్ట్రాల సంగతి వదిలేద్దాం. తెలంగాణలో 2014 వరకు పరిపాలించిన పార్టీ… 2014 తర్వాత జాడే లేకుండా పోతున్నది.

revanth reddy to be appointed as tpcc chief?

వీటన్నింటికీ కారణం ఏంటి? వరుసగా ఓటములు చెందుతున్న కాంగ్రెస్ పార్టీ లోపం ఎక్కడుంది.. అన్న దానిపై హైకమాండ్ దృష్టి పెట్టిందట. అందుకే… పార్టీలో అనూహ్య మార్పులు చేయాలని అధిష్ఠానం నిర్ణయించిందని టాక్.

అంతే కాదు.. ఎలాగూ పలు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లను మార్చాలని పార్టీ అనుకుంటుండటం… అందులోనూ టీపీసీసీ ప్రస్తుత చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీ కాలం ఎప్పుడో ముగిసింది. కానీ.. వరుసగా ఎన్నికలు రావడంతో ఆయన్ను అలాగే కొనసాగించింది అధిష్ఠానం.

ఇప్పుడు దాదాపుగా అన్ని ఎన్నికలు పూర్తయి రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ఈ సమయంలోనే పార్టీలో కీలక మార్పులు చేయనున్నట్టు పార్టీ హైకమాండ్ భావిస్తోంది. కీలక మార్పుల్లో తొలి అడుగు పీసీసీ చీఫ్ ను మార్చడమేనట.

పీసీసీ చీఫ్ గా ఎవరిని నియమిస్తే బాగుంటుంది. ప్రజాదరణ కలిగిన నేత ఎవరు? అంటూ హైకమాండ్ జల్లడ పడుతోందట. అంతే కాదు.. యూత్ కు బాగా దగ్గరైన వ్యక్తి అయితే ఇంకా బాగుంటుందని..యూత్ మనస్తత్వం తెలుసుకొని వాళ్లకు తగ్గట్టుగా ప్రణాళికలు రచించవచ్చని హైకమాండ్ భావిస్తోందట.

ఈనేపథ్యంలో వాళ్లకు కనిపించిన ఒకే ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోయినా.. లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందాడు. అంతే కాదు.. తెలంగాణలో కాస్త ఫాలోయింగ్ ఉన్న కాంగ్రెస్ నేత అంటే రేవంత్ రెడ్డే. అందుకే.. ఆయనకే తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అందించాలని భావిస్తున్నదట అధిష్ఠానం.

అయితే.. పార్టీలో ఉన్న చాలామంది సీనియర్లను వదిలిపెట్టి.. రేవంత్ కు పీసీసీ చీఫ్ పదవి ఇస్తే ఊరుకునేది లేదంటూ కొందరు సీనియర్ నేతలు వాపోతున్నట్టు సమాచారం. అయినప్పటికీ.. పార్టీ హైకమాండ్ మాత్రం రేవంత్ కే పగ్గాలు ఇవ్వనుందట. అంతే కాదు.. పార్టీలో చాలా మార్పులు చేపట్టి.. 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీకి బలం చేకూరాలని.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది హైకమాండ్.

పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ పాదయాత్ర

టీఆర్ఎస్ నాయకులను దైర్యంగా ఎదుర్కొనే రేవంత్ రెడ్డి.. పీసీసీ చీఫ్ అయ్యాక… తెలంగాణ అంతా పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నారట. మామూలు ఎంపీగా కన్నా.. పీసీసీ చీఫ్ గా పాదయాత్ర చేస్తే పార్టీకి కలిసి వస్తుందని రేవంత్ భావిస్తున్నారట. ఒకవేళ హైకమాండ్ కనుక రేవంత్ కు పీసీసీ పగ్గాలు ఇచ్చి.. పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలంగాణలో వచ్చేసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news