ఓల్డ్ స్ట్రాటజీతో రేవంత్.. వర్కౌట్ అయ్యేది ఎలా?

-

తెలంగాణ పి‌సి‌సి అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి…కాంగ్రెస్‌లో బాగా మార్పులు తీసుకొచ్చేస్తారని, పార్టీని టీఆర్ఎస్‌కు ధీటుగా నిలబెడతారని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి మొదట్లో దూకుడుగా రాజకీయం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో ఫైర్ అవుతూ వచ్చారు. అలాగే భారీ సభలు పెట్టి కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చారు. దీంతో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు రాష్ట్ర రాజకీయం మొదలైంది.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

కానీ అనూహ్యంగా ఈటల రాజేందర్ లాంటి బలమైన నాయకుడుని తీసుకుని హుజూరాబాద్ బరిలో టీఆర్ఎస్‌కు చెక్ పెట్టి బీజేపీ రేసులోకి వచ్చేసింది. పైగా కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆ పార్టీ దూకుడు ఓ రేంజ్‌లో కొనసాగుతుంది. ప్రజా సమస్యలపై గట్టిగానే గళం విప్పుతున్నారు. ఇక కేసీఆర్ సైతం కాంగ్రెస్‌ని టార్గెట్ చేస్తే పెద్దగా లాభం లేదనుకున్నారేమో అందుకే…బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. స్వయంగా ఆయనే రంగంలోకి బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. ధాన్యం అంశంలో బీజేపీని ఇరుకున పెట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అటు బీజేపీ కూడా తమదైన శైలిలో కేసీఆర్‌కు కౌంటర్లు ఇస్తుంది.

చివరికి అమిత్ షా సైతం రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టి బీజేపీ నేతలని నడిపిస్తున్నారు. కేసీఆర్ లొసుగులని చెప్పి…బీజేపీ నేతల్లో మరింత దూకుడు పెంచేలా ట్రై చేస్తున్నారు. ఇలా రెండు పార్టీల మధ్య హోరాహోరీ ఫైట్ జరుగుతుంది. ఈ రెండు పార్టీల మధ్య కాంగ్రెస్ వెనుకబడింది. పైగా రేవంత్ సైతం ఓల్డ్ స్ట్రాటజీలతోనే ముందుకెళుతున్నారు.

ఎప్పటిలాగానే బీజేపీ-టీఆర్ఎస్‌లు ఒకటే అని విమర్శిస్తున్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై అమిత్ షా డైరెక్షన్ లో కేసీఆర్ డ్రామాలు మొదలుపెట్టారని రేవంత్ అంటున్నారు. అంటే రెండు పార్టీలు ఒకటే అనే కాన్సెప్ట్‌ని జనంలోకి తీసుకెళ్ళేందుకు రేవంత్ గట్టిగానే ట్రై చేస్తున్నారు. కానీ ఈ విమర్శని జనం పట్టించుకోవడం లేదు. బీజేపీ-టీఆర్ఎస్‌ల మధ్య వార్ జరుగుతున్నట్లే చూస్తున్నారు..అలాంటప్పుడు రేవంత్ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వడం కష్టం..కాబట్టి ఆయన పూర్తిగా స్ట్రాటజీ మార్చాల్సిన అవసరం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news