కొడంగల్ బరిలో పట్నం..రేవంత్‌ని మళ్ళీ ఆపగలరా?

-

టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని బి‌ఆర్‌ఎస్ మరోసారి కట్టడి చేయగలుగుతుందా? 2018 ఎన్నికల్లో పట్నం నరేందర్ రెడ్డిని అభ్యర్ధిగా పెట్టి సక్సెస్ అయిన బి‌ఆర్‌ఎస్.. మరోసారి ఆయన్నే అభ్యర్ధిగా నిలబెడుతుంది. దీంతో మరిసారి పట్నం..రేవంత్‌కు చెక్ పెట్టగలరని కే‌సి‌ఆర్ భావించారా? అంటే అవుననే చెప్పుకోవాలి.మరోసారి పట్నంతో రేవంత్‌కు చెక్ పెట్టాలని కే‌సి‌ఆర్ చూస్తున్నారు. మరి అది సాధ్యమయ్యే పనేనా? అనేది ఒక్కసారి చూస్తే..

మొదట కొడంగల్ అనేది టి‌డి‌పి కంచుకోట. అక్కడ టి‌డి‌పి అయిదుసార్లు గెలిచింది. అందులో రేవంత్..2009, 2014 ఎన్నికల్లో గెలిచారు. నెక్స్ట్ కాంగ్రెస్ లోకి వెళ్లారు. 2018లో కూడా ఈయనదే విజయమని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా కే‌సి‌ఆర్ గాలి..హరీష్, కే‌టి‌ఆర్ వ్యూహాలతో రేవంత్‌కు చెక్ పడింది. పట్నం నరేందర్ చేతిలో ఓటమి పాలయ్యారు. కానీ తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్..మల్కాజిగిరి ఎంపీగా గెలిచారు. నెక్స్ట్ టి‌పి‌సి‌సి అధ్యక్ష పదవి వచ్చింది. అక్కడ నుంచి రేవంత్ దూకుడు పెరిగింది.

ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కొడంగల్ బరిలో దిగడానికి రేవంత్ సిద్ధమవుతున్నారు. అటు బి‌ఆర్‌ఎస్ నుంచి పట్నం బరిలో ఉన్నారు. ఎమ్మెల్యేగా పట్నంపై పెద్దగా పాజిటివ్ లేదని సర్వేలు చెబుతున్నాయి. కాకపోతే ఆర్ధికంగా, సామాజికంగా బలమైన నేత కావడంతోనే పట్నంకు కే‌సి‌ఆర్ మళ్ళీ ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది.

అయితే ఈ సారి కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడించడం సులువు కాదు. సర్వేలు మొత్తం ఆయనకు అనుకూలంగా ఉన్నాయి. ఈ సారి ఎలాంటి వ్యూహాలనైనా చేధించి రేవంత్ గెలుస్తారని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. మొత్తానికైతే కొడంగల్ లో రేవంత్‌కు స్వల్ప ఆధిక్యం ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news