కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్ కరెక్టే…ఇప్పుడే ఊపు వచ్చిందా?

-

దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఎప్పటినుంచో ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఉద్యమం అనేక రూపాల్లో కొనసాగుతూనే ఉంది. అలాగే ఆ మధ్య బీజేపీకి చెందిన ఓ నేత….ర్యాలీగా వెళుతున్న రైతులపై కారుతో తొక్కించిన విషయం తెలిసిందే. ఇవన్నీ ఎప్పుడో జరిగిన సంఘటనలు…దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు స్పందించలేదు. కానీ తాజాగా ఆయనకు ఊపు వచ్చినట్లు కనిపిస్తోంది. ఒక్క హుజూరాబాద్ దెబ్బకు కేసీఆర్‌…బీజేపీపై ఫ్రస్టేషన్ అంతా బయటపెట్టేశారు.

revanth-reddy-cm-kcrఅప్పుడు రైతు చట్టాలకు పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు మద్ధతు ఇచ్చి…ఇప్పుడు రైతుల కోసం ఢిల్లీ వెళ్ళి ఉద్యమం చేస్తామని హడావిడి చేస్తున్నారు. ఇదే విషయాన్ని టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇకపై తెలంగాణ నుంచి బాయిల్డ్‌ రైస్‌ కొనాలని కోరబోమంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఇచ్చే అధికారం సీఎం కేసీఆర్‌కు ఎవరిచ్చారని రేవంత్ ఫైర్ అవుతున్నారు.

కేంద్రం తెచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలపై ఏడాది కాలంగా రైతులు పోరాడుతున్నారు. కానీ ఏనాడూ కేసీఆర్…ఉద్యమంపై స్పందించలేదు. పైగా ఢిల్లీకి వెళ్ళి మోదీతో ములాఖత్‌లకు, పార్టీ ఆఫీసు శంకుస్థాపనలు చేయడానికి కేసీఆర్‌కు సమయం ఉందని, కానీ ఎప్పుడు అక్కడే పోరాడుతున్న రైతాంగాన్ని పరామర్శించాలన్న జ్ఞానం కలగలేదని రేవంత్ ..కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. వాస్తవానికి చెప్పాలంటే కేసీఆర్ పదే పదే ఢిల్లీకి వెళుతున్నారు గానీ, ఏనాడూ కూడా పోరాటం చేస్తున్న రైతులకు మద్ధతుగా నిలవలేదు. ఇప్పుడేమో ఢిల్లీకి ధర్నా చేస్తానని హడావిడి చేస్తానని అంటున్నారు.

అంటే తెలంగాణ ప్రజలకు తనపై ఉన్న వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికే కేసీఆర్…ఇలాంటి మాటలు చెబుతున్నట్లు కనిపిస్తోంది. పైగా కేంద్రమే పెట్రోల్, డీజిల్ రేట్లని పెంచిందని, ఇప్పుడు కేంద్రమే తగ్గించిందని, తాము ఎప్పుడు పెంచలేదని, అందుకే తగ్గించే అవసరం లేదన్నట్లు కేసీఆర్ మాట్లాడుతున్నారు. కానీ పెట్రో ఉత్పత్తులపై రెండు సార్లు రెండు రూపాయల చొప్పున మొత్తం రూ. 4 పన్ను పెంచారని రేవంత్ చెబుతున్నారు. మొత్తానికి కేసీఆర్‌కు రేవంత్ ఇచ్చిన కౌంటర్లలో వాస్తవాలు ఉన్నాయని చెప్పాలి. కానీ హుజూరాబాద్‌లో ఓడిపోవడంతో కేసీఆర్‌కు తలనొప్పి పెరిగింది…అందుకే ఇప్పుడు పూనకం వచ్చినట్లు మాట్లాడేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news