ఒకే సారి బీజేపీ, టీఆర్ ఎస్‌పై అస్త్రాల‌ను ఎక్కుపెడుతున్న రేవంత్ రెడ్డి..!

-

మొన్నటి వరకు రేవంత్ రెడ్డి (revanth reddy) టీపీసీసీ గా ఎన్నికైతే … రచ్చ రచ్చ చేశారు కాంగ్రెస్ నేతలు. కానీ రేవంత్ ఓపిగ్గా వారందరినీ మచ్చిక చేసుకునే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లను ఇప్పటికే కలిసిన రేవంత్ రెడ్డి తాజాగా కార్యాచరణను కూడా ప్రకటించారు. ఈ నెల 12వ తేదీన పెట్రోల్ రేట్ల పెరుగుదలను నిరసిస్తూ… అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

 రేవంత్ రెడ్డి /revanth reddy
రేవంత్ రెడ్డి /revanth reddy

అంతే కాకుండా ఈ నెల 16న చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం కూడా ఉంటుందని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. అలాగే నిరుద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, రాష్ర్ట ప్రభుత్వం వారి గురించి సరిగ్గా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ… 48 గంటల నిరసనను కూడా ప్లాన్ చేశారు.

పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపును నిరసిస్తూ… ఈ నెల 12 న చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. అంతే కాకుండా రేవంత్ రెడ్డి రాకతో కేసీఆర్ లో వణుకు మొదలైందని వారు పేర్కొంటున్నారు. ఎలాగైనా సరే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ను ఇరకాటంలోకి నెట్టి కాంగ్రెస్ కు రాష్ర్టంలో పూర్వ వైభవం తీసుకురావాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడట. పార్టీ పగ్గాలు చేపట్టిన వెంటనే వరుస కార్యక్రమాలను రచిస్తూ… కార్యకర్తల్లో జోష్ నింపుతున్నాడు. ఎలాగైనా సరే రాష్ర్టంలో నిర్వహించే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ను గట్టి పోటీదారుగా అందరూ భావించేలా చేయాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి స్పీడ్ తో రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా జోష్ కనిపిస్తోంది. ఇదే ఊపులో ఎలాగైనా రాష్ర్టంపై పట్టు సాధించాలని వారంతా యోచిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news