రేవంత్ రెడ్డి ప్లాన్ అదిరింది.. ఆ విష‌యంలో బీజేపీకి ఇబ్బందులేనా..?

ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో వ్య‌తిరేక‌త‌లు, భ‌గ‌భ‌గ‌ల న‌డుమ పార్టీ ప‌గ్గాలు తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఆయ‌న‌కు ఇత‌ర పార్టీల కంటే సొంత పార్టీ నుంచే తీవ్ర ఇబ్బందులు వ‌చ్చినా కూడా ఎక్క‌డా వెర‌వ‌కుండా నిత్యం త‌న పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డ‌మే త‌న ప‌ని అన్న‌ట్టు ప్లాన్ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక ఇందులో భాగంగానే రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తున్నారు. ఇక ఎక్క‌డ బీజేపీ త‌న‌కు పోటీ వ‌స్తుందో అని దానికి చెక్ పెట్టేందుకు మాస్ట‌ర్ ప్లాన్ వేశారు.

ఇప్పుడు ఆల్రెడీ టీఆర్ ఎస్ ఎలాగూ బ‌లంగా ఉంది. కాబ‌ట్టి తాను పోరాడాల్సి వ‌స్తే అది టీఆర్ ఎస్‌తోనే కావాలి గానీ రోజురోజుకూ బ‌ల‌ప‌డుతున్న బీజేపీ కూడా త‌న‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కావొద్ద‌ని రేవంత్ డైరెక్టుగా టీఆర్ ఎస్‌పైనే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయినా కూడా బీజేపీలోకి బ‌ల‌మైన నేత‌లెవ‌రూ వెళ్ల‌కుండా చూసేందుకు సిద్ధ‌మ‌య్యారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొన్న‌టి దాకా కాంగ్రెస్, టీఆర్ ఎస్ నుంచి బీజేపీలోకి వ‌ల‌స‌లు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. కానీ రేవంత్ వ‌చ్చాక దీనికి బ్రేక్ వేస్తున్నారు. టీఆర్ ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న వారెవ‌రూ బీజేపీలోకి వెళ్ల‌కుండా కాంగ్రెస్ లోకి రావాల‌ని వారిని క‌లుస్తూ ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీలోకి వెళ్లేందు్కు చూస్తున్న వారిని తానే ముందు క‌లుస్తూ చేతులు కలుపుతున్నారు. అందుకే ఈ న‌డుమ బీజేపీలోకి పెద్ద‌గా వ‌ల‌స‌లు లేకుండా పోయాయి. మొత్తానికి రేవంత్ బీజేపీ బ‌ల‌ప‌డకుండా బాగానే ప్లాన్ వేస్తున్నారు.