రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాక పార్టీని ఉరికిస్తున్నాడు. అందులో భాగంగానే దళిత, గిరిజన దండోరా సభలు పెట్టి విజయవంతం చేశారు. ఆ సభలలో మొదటగా కేసీఆర్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్‌పై విమర్శలు, కౌంటర్లు ఉండేలా చూసుకుంటున్నారు. ఎలాగైతే కేసీఆర్ కొడంగల్‌లో రేవంత్‌ను ఓడించేందుకు ప్లాన్ చేశారో, ఇప్పుడు కేసీఆర్ కు కూడా తన ఇలాకాలో చెక్ పెట్టాలని రేవంత్ చూస్తున్నాడని సమాచారం.
అయితే అది సాధ్యమయ్యే పని కాదని రేవంత్‌కు తెలుసు. అయినా తన ప్రభావం అయితే కేసీఆర్ ఇలాకాలో చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక దానిలో భాగంగా కేసీఆర్ దత్తత తీసుకున్న మూడుచింతపల్లి గ్రామంలో దీక్ష చేయడం కూడా పెద్ద దుమారంగా మారింది. దళిత, గిరిజన సభలే కాకుండా త్వరలోనే మరిన్ని సభలను నిర్వహించేదుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఇక ఈ సభలలో మరో సంచలన వ్యాఖ్య కూడా చేశారు. తాను త్వరలోనే గజ్వేల్ నియోజకవర్గంలో సభ నిర్వహిస్తానంటూ ఒక సంచలన ప్రకటన చేశారు. ఇక దత్తత గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని చూపించడంతో మీడియా మొత్తం ఆ దత్తత గ్రామాలపై దృష్టి సారించింది. దాంతో ఇన్ని రోజులు ఆ గ్రామాలను పట్టించుకోని వారు కూడా వాటి గురించి మాట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ చర్చే కేసీఆర్ ప్రతిష్ట దెబ్బ తినేలా కనిపిస్తోంది. రేవంత్ త్వరలోనే గజ్వేల్ సభ పెడితే, మరిన్ని చిక్కులు తప్పవని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారంట. రేవంత్ ఇంకెవరి మీద తన విమర్శల అస్త్రాలను ఉపయోగిస్తాడో అని అందరూ అనుకుంటున్నారు. రానున్న రోజుల్లో రేవంత్ ఇంకెన్ని సంచలనాలు చేస్తాడో చూడాలి మరి..