తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచిన విషయం తెలిసిందే..రాజకీయంగా అధికార టీఆర్ఎస్‌కు చెక్ పెట్టడానికి పదునైన వ్యూహాలతో ముందుకెళుతుంది..ఎక్కకక్కడ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ..టీఆర్ఎస్‌ని కట్టడి చేయాలని చూస్తుంది. ఇలా ఓ వైపు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే..మరో వైపు పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం అయ్యేలా చేయనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణిరుద్రమదేవిలు..2018లొ యువ తెలంగాణ పార్టీని పెట్టిన విషయం తెలిసిందే..అయితే పార్టీ అనుకున్న మేర సక్సెస్ కాలేకపోయింది..కానీ రాజకీయంగా జిట్టా, రాణిరుద్రమలు మాత్రం బాగానే పట్టు సాధించారు..ప్రజా సమస్యలపై గళం విప్పడంలొ ముందున్నారు. అయితే రాజకీయంగా పార్టీ క్లిక్ కాకపోవడంతో వీరు..బీజేపీలో పార్టీని విలీనం చేయడానికి సిద్ధమయ్యారు.
తెలంగాణలొ బీజేపీ వేగంగా పుంజుకుంటున్న విషయం తెలిసిందే..ఇలాంటి సమయంలో యువ తెలంగాణ పార్టీ విలీనం కావడం..బీజేపీకి ప్లస్ అవుతుంది. ఇక 16న పార్టీ విలీన కార్యక్రమం జరగనుంది. అయితే బీజేపీలోకి వస్తున్న జిట్టా, రాణిరుద్రమలకు సీట్లు ఖరారు కానున్నాయని సమాచారం. జిట్టాకు భువనగిరి ఎంపీ సీటు..రాణిరుద్రమకు ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సీట్లు దక్కనున్నాయని తెలుస్తోంది. అయితే గతంలో జిట్టా భువనగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. దీంతో ఆయనకు భువనగిరి ఎంపీ సీటు ఇస్తే బాగుంటుందనే ఆలోచనలొ బీజేపీ ఉందని తెలుస్తోంది.
ఇక రాణిరుద్రమకు ఇబ్రహీంపట్నం సీటు దాదాపు ఖరారైనట్లే అని తెలుస్తోంది. అయితే ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో బలమైన నాయకులు ఉన్నారు. టీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఉండగా, కాంగ్రెస్ వైపు మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో మంచిరెడ్డిపై కేవలం 250 ఓట్ల తేడాతో రంగారెడ్డి ఓడిపోయారు. ఈ సారి మాత్రం మంచిరెడ్డికి ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్నారు. అయితే ఇలా ఇద్దరు బలమైన నాయకుల మధ్య బీజేపీ నుంచి బరిలో దిగి రాణిరుద్రమ ఎంత వరకు పోటీ ఇస్తారనేది చూడాలి.