హస్తంలో సీతక్క-భట్టిలకే మళ్ళీ ఛాన్స్ ఉందా?

-

గతంలో తెలంగాణలో కాంగ్రెస్‌ని కొట్టే పార్టీనే లేదు. అసలు ఆ పార్టీకి ధీటుగా ఏ పార్టీ నిలబడలేకపోయేవి. కానీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పరిస్తితి దారుణంగా తయారైంది. వరుసగా రెండుసార్లు కూడా కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితమైంది. ఇక ఇప్పటికీ ఆ పార్టీ పరిస్తితి మెరుగైనట్లు కనిపించడం లేదు. పైగా టీఆర్ఎస్-బీజేపీల మధ్యే వార్ నడుస్తుంది గానీ…కాంగ్రెస్ రేసులో వెనుకబడిపోయింది.

అయితే కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోయింది…అలాగే ఉన్న ఎమ్మెల్యేల బలం తగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పలు విపక్ష పార్టీలతో ప్రజా కూటమిగా ఏర్పడి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 19 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇక ఇందులో 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి జంప్ చేశారు. అలాగే ఎంపీగా గెలవడంతో హుజూర్‌నగర్ స్థానానికి ఉత్తమ్ కుమార్ రాజీనామా చేయడంతో ఉపఎన్నిక వచ్చింది. ఆ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిచింది దీంతో కాంగ్రెస్‌కు ఆరు సీట్లు మాత్రమే మిగిలాయి.

మధిరలో భట్టి విక్రమార్క, మంథనిలో శ్రీధర్ బాబు, ములుగులో సీతక్క, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భద్రాచలంలో పోడెం వీరయ్య, సంగారెడ్డిలో జగ్గారెడ్డిలు మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఆరుగురు ఎమ్మెల్యేలే. మరి ఈ ఆరుగురు మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా? లేక వేరే పార్టీల్లోకి జంప్ చేస్తారా? అనేది క్లారిటీ లేకుండా ఉంది. ఎందుకంటే కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్లే ఉంటున్నారు. ఇటు జగ్గారెడ్డి…టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కయ్యం పెట్టుకుంటున్నారు.

ఇక మిగిలిన నలుగురు కాంగ్రెస్‌లో ఉంటారని గ్యారెంటీ ఉంది. మరి వారిలో నెక్స్ట్ కాంగ్రెస్ నుంచి బరిలో దిగితే ఎవరు గెలుస్తారనే విషయాన్ని చూసుకుంటే భట్టి, సీతక్కలకే మళ్ళీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీరు ఎక్కువగా ప్రజల్లోనే ఉంటున్నారు. అలాగే వారి వారి నియోజకవర్గాల్లో స్ట్రాంగ్‌గా ఉన్నారు. కాబట్టి మళ్ళీ భట్టి, సీతక్కలకే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news