రాజకీయాల్లో ఏ నాయకుడుకైన పవర్ అనేది ఎల్లకాలం ఉండదు..ఏదొక సమయంలో నాయకుల పవర్ తగ్గక తప్పదు…వారికి జనాల్లో ఆదరణ కూడా పెద్దగా ఉండదు..అలాంటి సమయాల్లో సీనియర్లని పార్టీ వరకే పరిమితం చేసి…యువతని రాజకీయంగా ఎంకరేజ్ చేయాలి..అలా చేయకపోతే పార్టీకే డ్యామేజ్ జరుగుతుంది. అలా చేయకపోవడం వల్లే తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ జరుగుతూ వస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ టీడీపీ గురించి మాట్లాడుకునే ముందు…వైసీపీ గురించి మాట్లాడుకుంటే…వైసీపీలో యువ నేతలు ఎక్కువగానే ఉన్నారు..50 ఏళ్ల లోపు ఉన్న నేతలు ఎక్కువే..అలాగే బలమైన సీనియర్లు కూడా ఉన్నారు.
ఇలా యువ నేతలు ఎక్కువగా, సీనియర్లు సరిపడా ఉండటంతో వైసీపీ బలంగా ఉంది…కానీ టీడీపీలో అలాంటి పరిస్తితి లేదు…యువ నేతలు తక్కువ, సీనియర్లు ఎక్కువ అందుకే టీడీపీ ఇంకా పూర్తిగా బలం పుంజుకోలేకపోతుంది. ఒకప్పుడు అంటే సీనియర్లకు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది…కానీ 2014 ఎన్నికల నుంచి సైకిల్ సీనియర్లకు ఆదరణ తగ్గుతూ వస్తుంది..కొందరు సీనియర్లకు ప్రజల్లో ఆదరణ కూడా లేదు. వారు పూర్తిగా ఔట్ డేటెడ్ నేతలు అయిపోయారు.
చంద్రబాబు సైతం…వారిని పక్కన పెట్టకుండా ఇంకా పార్టీలో పెత్తనం ఇస్తున్నారు…సీట్లు ఇస్తున్నారు…దీని వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పటికీ పార్టీలో సీనియర్లు…పార్టీకి భారంగానే ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా యనమల రామకృష్ణుడు, టీడీ జనార్ధన్, వర్ల రామయ్య లాంటి వారు పుత్రిగా ఔట్ డేటెడ్ వీరి వల్ల ఒక్క ఓటు పడదు.
అలాగే కొనకళ్ళ నారాయణ, మాగంటి బాబు, రాయపాటి సాంబశివరావు, పనబాక లక్ష్మీ, నిమ్మల కిష్టప్ప, మాల్యాద్రి, జలీల్ ఖాన్, ఉప్పులేటి కల్పన, తోట సీతారామలక్ష్మీ, కోళ్ళ లలితకుమారి…ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలకు ప్రజల్లో ఆదరణ తక్కువగా ఉంది…ఇంకా ప్రజల్లో ఆదరణ లేని సీనియర్ నేతలు చాలామందే ఉన్నారు. వారిని ఇంకా పార్టీ సీట్లు ఇవ్వడం, పార్టీలో పెత్తనం ఇవ్వడం వల్ల టీడీపీకి నష్టమే తప్పా? లాభం లేదని చెప్పొచ్చు.