ఒక్క వార్తతో ఏపీ ప్రభుత్వంలో అలజడి…!

-

ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మక కంపెనీగా ఉన్న కియా మోటార్స్ తమిళనాడు వెళ్ళిపోయే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. రాయిటర్స్ దీనిపై కథనం రాసిన నేపధ్యంలో ఒక్కసారిగా ఏపీ ప్రభుత్వంలో అలజడి రేగింది. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజిత్ భార్గవ నుంచి పార్లమెంట్ వరకు ఈ కంపెనీ ప్రస్తావన వచ్చింది. ఇది ఎక్కడికి వెళ్ళడం లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది.

ఆ వార్తలను తోసి పుచ్చడమే కాకుండా తప్పుడు ప్రచార, అంటుంది. ఉదయం రజిత్ భార్గవ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తుందని అన్నారు. దీనిపై హిందుపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా స్పందించారు. దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. లోక్సభా పక్ష నేత మిథున్ రెడ్డి మాట్లాడుతూ కియా ఎక్కడికి వెళ్ళడం లేదని, అదంతా తప్పుడు ప్రచారమేనని అన్నారు. దీనిపై కియానే స్పందిస్తుంది అన్నారు.

లోక్సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఈ అంశాన్ని ప్రస్తావించగా దీనిని వైసీపీ ఎంపీలు ఖండించారు. ఎమ్మెల్యే రోజా కూడా దీనిని ఖండించారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. అసలు కియా ఎక్కడికి వెళ్ళడం లేదని అన్నారు. తాజాగా ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి కూడా స్పందించారు. కియా ప్లాంట్ తరలిస్తారు అనేది తప్పుడు ప్రచారమని ఆయన అన్నారు. ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారమని ఆయన అన్నారు.

కియా ఎక్కడికి వెళ్ళడం లేదని స్పష్టం చేసారు. కియా పరిశ్రమకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నామని అన్నారు. కియా పరిశ్రమ నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియాలో అంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాగా కంపెనీని తమిళనాడు తరలిస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కియా యాజమాన్యం తమిళనాడుతో సంప్రదింపులు జరిపినట్టు రాయిటర్స్ కథనం క్రాసింది.

Read more RELATED
Recommended to you

Latest news