వ్యూహాల‌ను ముందే చెప్పేస్తున్న ష‌ర్మిల.. ఇలా అయితే ఎలా..

ష‌ర్మిల ఎంత‌టి రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చిందో అంద‌రికీ తెలిసిందే. కానీ ఎప్పుడైతే ఆమె తెలంగాణ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్ప‌టి నుంచే ఆమెకు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఆమె ఎంత‌లా దీక్ష‌లు, ధ‌ర్నాలు చేస్తున్నా కూడా ఆమెను ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డం ఆమెకు పెద్ద స‌మ‌స్య‌గా మారింద‌నే చెప్పొచ్చు. ఇక్క‌డే ఆమెకు మ‌రో పెద్ద స‌మ‌స్య ఏంటంటే ఆమె ప్రోగ్రామ్‌లు సాక్షి మీడియాలో క‌వ‌ర్ కాక‌పోవ‌డం. ఇంకో విష‌యం ఏంటంటే ష‌ర్మిల త‌న రాజ‌కీయ వ్యూహాలను కూడా ముందుగానే వెల్ల‌డించ‌డం.

Sharmila
Sharmila

ఇవ‌న్నీ వెర‌సి ఆమెకు పెద్ద ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. అయినా ఆమె మాత్రం అల‌ర్ట్ కాకుండా అలాగే కొనసాగుతున్నారు. రాజీకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల వ్యూహాలు తెలుసుకునేందుకు ప్ర‌య్న‌తించాలి. కానీ త‌మ వ్యూహాల‌ను మాత్రం ఎవ‌రికీ తెలియ‌కుండా అమ‌లు చేయాలి. అప్పుడే ఎవ‌రైనా స‌క్సెస్ అవుతారు. కానీ ష‌ర్మిల మాత్రం ఇవేవీ ప‌ట్టించుకోకుండా మ‌రోసారి త‌న వ్యూహాల‌ను బ‌య‌ట పెట్టేసింది.

సాక్షి మీడియాకు తాను కూడా సహ యజమానినేన‌ని తేల్చేశారు. కానీ త‌న కార్య‌క్ర‌మాల‌ను మాత్రం ఎందుకు క‌వ‌ర్‌చేయ‌ట్లేద‌నే దానిపై మాత్రం స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం. కార‌ణాలు ఏమైనా కూడా ఆమె ఇలా మీడియాల గురించి మాట్లాడ‌కుండా ఉండాల్సింద‌ని చెబుతున్నారు. ఎందుకంటే సాక్షి మీడియా ఆంధ్రాకు అనుకూలంగా ఉంటుంది కాబ‌ట్టి ఇప్ప‌టికే త‌న మీద ఆంధ్రా ఎఫెక్ట్ ఉన్న స‌మయంలో ఇలాంటివి బ‌య‌ట పెట్ట‌కుండా ఉండాల‌ని సూచిస్తున్నారు.

ఇక మ‌రో ప్లాన్ అయిన ప్రశాంత్ కిశోర్ స‌హ‌కారం తీసుకునే విష‌యంపై ఎప్ప‌టి నుంచో వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై ఇన్ని రోజుల దాకా ఎవ‌రూ స్పందించ‌లేదు. కానీ ష‌ర్మిల మాత్రం నేరుగానే ఈ విష‌యం గురించి రీసెంట్ గా పాల్గొన్న ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పేశారు. త‌న పార్టీతో క‌లిసి ప‌ని చేస్తానంటూ పీకే గ‌తంలోనే హామీ ఇచ్చేశార‌ని చెప్పేశారు. ఇక అటు జ‌గ‌న్ కూడా పీకే స‌హ‌కారం తీసుకుంటున్న నేప‌థ్యంలో ఇటు ష‌ర్మిల కూడా ప్లాన్ బ‌య‌ట‌పెట్డడం సంచ‌ల‌నం రేపుతోంది. దీంతో జ‌గ‌న్‌, ష‌ర్మిల ఒక‌టేన‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చే ప్ర‌మాదం ఉంది.