షర్మిల కు మరో చిక్కులు.. వారిని నమ్ముకుంటే ఇలా చేస్తున్నారేంటి..

-

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం ఎవరి తరం కావట్లేదు. నిజానికి రాజకీయాల్లో ఉండి ప్రజల నమ్మకాన్ని సంపాదించాలన్నా లేదంటే ఇతర నేతల విషయంలో పెద్ద లీడర్ అనిపించుకోవాలన్నా కూడా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏ మాత్రం పొరపాటు చేసినా కూడా నలుగురిలో చిన్న స్థాయి అనిపించుకోవాల్సి వస్తుంది. ఇకపోతే వైఎస్ షర్మిల కూడా ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ చివరకు నవ్వుల పాలవ్వుతున్నారు. తెలంగాణలో తన తండ్రి రాజన్న రాజ్య స్థాపనే లక్ష్యంగా ఆమె పార్టీ పెట్టారు.

Sharmila
Sharmila

అయితే ఆమె ప్రధాన ఎజెండాగా తెలంగాణ నిరుద్యోగుల సమస్యలను ఎత్తుకుని ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ విధంగా ఆమె నిరసనలు చేస్తున్న క్రమంలోనే కొన్ని అనుకోని ఇబ్బందులు ఆమెను ఇరకాటంలో పడేస్తున్నాయి. ఇక రీసెంట్ గా మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో ఆమె దీక్ష చేపట్టారు. కాగా ఇక్కడ గతంలో ఆత్మహత్య చేసుకున్న రవీందర్నాయక్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ క్రమంలోనే ఎగ్జిబిషన్ మైదానంలో షర్మిల నిరుద్యోగ దీక్ష చేపట్టారు.

కానీ ఈ కార్యక్రమానికి పోలీసులు అడ్డుపడి ఆమెను లోటస్ పాండుకు తరలించారు. అయితే ఈ కార్యక్రమానికి మొదట కార్యకర్తలు చాలా తక్కువగా రావడంతో ఆమె అనుచరులు కొందరు అడ్డాకూలీలను ఒక్కొక్కరికి రూ.400 చొప్పున ఇస్తామంటూ మాట్లాడుకుని తీసుకువవచ్చారు. ఇక దీక్ష జరగకపోవడంతో డబ్బులు ఇవ్వకుండా నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కూలీలు అక్కడే నిరసన వ్యక్తం చేశారు. కాగా ఈ ఉదంతం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా అయిపోయింది. అందరూ కూడా షర్మిలది పెయిడ్ దీక్ష అని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. చూడాలి మరి షర్మిల ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news