ఐపీఎల్‌ లో మరో రెండు కొత్త జట్లకు బీసీసీఐ ప్రణాళికలు

-

ఐపీఎల్‌లో మరో రెండు కొత్త జట్లను చేర్చాలని బీసీసీఐ గత కొద్ది నెలలుగా యోచిస్తున్న విషయం తెల్సిందే. అయితే వచ్చే ఏడాది ఐపీఎల్‌ (IPL) లో కొత్త జట్లను తీసుకొచ్చేలా బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది. రెండు కొత్త ఫ్రాంచైజీలతో పాటు ఆటగాళ్ళ మెగా వేలం, రీటెన్షన్‌ విధానం, బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ పై కూడా ఆలోచనలు చేస్తుంది.

ఐపీఎల్‌ / IPL
ఐపీఎల్‌ / IPL

కొత్త ఫ్రాంచైజీల విషయానికి వస్తే అహ్మదాబాద్‌కు చెందిన అదానీ గ్రూప్‌, హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మాలతో పాటు సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ (కోల్‌కతా), టొరెంట్‌ గ్రూప్‌ (గుజరాత్‌)లు ప్రధానంగా పోటీ పడుతున్నట్లు సమాచారం. కొత్త ఫ్రాంచైజీల కోసం ఆగస్టులో టెండర్లు పిలవనుండగా…సెప్టెంబర్లో ఈ ప్రక్రియ ముగియనుంది.కొత్త ఫ్రాంచైజీల నేపథ్యంలో ఆటగాళ్ళ రీటెన్షన్‌, మెగా వేలం కూడా జరపాల్సి ఉంటుంది. దీంతో డిసెంబర్లో మెగా వేలం వేసేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది.

మెగా వేలానికి ముందు గత ఫ్రాంచైజీలు గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్ళను రీటెయిన్‌ చేసుకోవచ్చు. అయితే ముగ్గురు భారతీయులు, ఒక విదేశీ ఆటగాడిని…. లేదా ఇద్దరు భారతీయులు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను రీటెయిన్‌ చేసుకోవచ్చు. జట్ల సంఖ్య పెరిగితే మ్యాచ్ ల సంఖ్య కూడా పెరగనుంది. దీంతో జనవరిలో బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ కోసం టెండర్లు పిలవనుంది. దాదాపు 90కి పైగా మ్యాచులు నిర్వహించే అవకాశం ఉండడంతో బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news