శాశన మండలిలో తెలుగుదేశం పార్టీ పట్టు నెగ్గింది. తెలుగుదేశం పార్టీ ఉదయం నుంచి పట్టుబడుతున్న విధంగా రూల్ 71 పై చర్చ మొదలయింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్ చర్చను ప్రారంభించారు. సభలో బిల్లులను మంత్రులు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, బొత్సా సత్యనారాయణ ప్రవేశపెట్టిన కాసేపటికే చైర్మన్ ఈ చర్చకు అనుమతించడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
సభలో ఉదయం నుంచి అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ రూల్ 71 పై చర్చ జరగాలని డిమాండ్ చేసింది. వికేంద్రీకరణ బిల్లుపై చర్చ వద్దని డిమాండ్ చేస్తూ ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేసారు. ఈ తరుణంలో అనేక వాయిదాల నడుమ సభ వాయిదా పడుతూ వచ్చింది. మంత్రులు అందరూ పెద్ద ఎత్తున సభలో ఆందోళన చేసారు.
అయితే ఈ తరుణంలో సాయంత్రం 6;30 నిమిషాల తర్వాత మండలిలో బిల్లులు ప్రవేశపెట్టడానికి అనుమతి ఇచ్చారు చైర్మన్ షరీఫ్. దీనిపై తెలుగుదేశం ఆందోళనకు దిగింది. అసలు సభలో చర్చ ముందు రూల్ 71 పై జరగాలని డిమాండ్ చేసారు తెలుగుదేశం నేతలు. ఈ తరుణంలో మంత్రులు ప్రవేశ పెట్టిన బిల్లులపై ఒకసారే చర్చ జరగాలని డిమాండ్ చేసారు. దీనికి కుదరదని దేనికి అదే చర్చ జరగాలని టీడీపీ డిమాండ్ చేసింది.