వికేంద్రీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం పొందిన గాని శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి బలం ఎక్కువగా ఉండటంతో తెరపైకి రూల్ 71 తీసుకురావడంతో శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందే అవకాశం కష్టమని కొంతమంది సీనియర్ రాజకీయ నేతలు కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో వైయస్ జగన్ అసలు సిసలు గేమ్ ప్లాన్ చేసినట్లు ఈ దెబ్బతో చంద్రబాబుకి శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు షాక్ ఇవ్వబోతున్న ట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తన పదవికి రాజీనామా చేయడంతో మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నట్లు ముఖ్యంగా ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్సీలు జగన్ తీసుకున్న వికేంద్రీకరణ బిల్లుకు జై కొట్టిన డానికి రెడీ అవుతున్నట్లు దీనికిగాను శాసనమండలిలో జరిగే సమావేశాలకు గైర్హాజర్ అవ్వాలన ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. వికేంద్రీకరణ బిల్లు శాసన మండలిలో కూడా ఆమోదం పొందకుంటే మాత్రం ఇక పూర్తిగా చంద్రబాబు ఊబిలో కూరుకుపోయినట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.