బ్యాడ్ సిగ్నల్స్: పూర్తిగా లోకేష్ గా మారుతున్న చంద్రబాబు!

-

సుమారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ… సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన మార్కు రాజకీయం చేసిన నేర్పు… ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయింది.. నాటి మెచ్యూరిటీ లెవెల్స్ ఇప్పుడు లేవెందుకు? వయసు పెరిగే కొద్దీ రావాల్సిన పెద్దరికం కాస్తా… లోకేష్ మార్కు పిల్ల చేష్టల్లా మారిపోతుందెందుకు? పైన చెప్పుకున్న ఉపోద్ఘాతం అంతా ఎవరి గురించో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా! ఆయనే ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు! కొత్త కొత్త ఆలోచనలు, క్లిష్ట సమయాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్న అనుభవం ఉన్న వ్యక్తి… కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిలా ప్రవర్తించడం ఏమిటి.. కుర్రతనంతో చేసే చిల్లర వ్యవహారాల్లా ఇంతపెద్ద వ్యక్తి నడుచుకోవడం ఏమిటి? ప్రస్తుతం సదరు టీడీపీ కార్యకర్త మనసును తొలిచేస్తున్న ప్రశ్నలు ఇవి!

ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనుల ఫలితమో… లేక బాబు కంటే జగన్ సమర్ధుడని జనాలు నమ్మడమో… టీడీపీ గెలిస్తే లోకేష్ ను భరించడం చాలా కష్టం అని అనుకోవడంఓ… కారణం ఏదైనా గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకి పట్టపగలే చుక్కలు చూపించారు ఏపీ ఓటర్లు! చావుతప్పి కన్నులొట్ట పోయినట్లుగా ఉన్న పరిస్థితి ఉన్నప్పుడే కదా… కాస్త సంయమనం పాటించి, కూల్ గా ఆలోచిస్తూ, భవిష్యత్తుని పక్కాగా ప్లాన్ చేసుకోవాలి! కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చంద్రబాబు అంత సీనియారిటీని కలిగి ఉండి కూడా అలా ఆలోచించడం లేదు! దీనికి కారణం లోకేష్ అని చాలాసార్లు అనిపించినా… మొదట్లో అది చాలా తక్కువగా ఉండేది!

లోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లోనే చంద్రబాబు ఆలోచనా విధానంలో మార్పు రావడం స్టార్ట్ అయ్యిందని అంటున్నారు విశ్లేషకులు. అనంతర లోకేష్ ఎప్పుడైతే కేబినెట్ లో అడుగుపెట్టారో.. ఆ సమయంలో లోకేష్ గా చంద్రబాబు మారిపోవడానికి సంబందించిన దశ స్టార్ అయ్యిందని అంటున్నారు! అనంతరం బాబు బ్రెయిన్ కి పనిచెప్పడం మానేసి లోకేష్ బ్రెయిన్ తో ఆలోచించడం మొదలుపెట్టినట్లున్నారు. అనంతరం ఎన్నికలు, ఫలితాలు! అంతే… గెలుపోటముల విషయంలో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు కాస్త ఆల్ మోస్ట్ లోకేష్ గా మారేపరిస్థితి వచ్చేసింది.

ఈ క్రమంలో… తాజాగా కరోనా ఎఫెక్ట్ వల్ల రాష్ట్రానికి దూరంగా ఉంటున్న చంద్రబాబు… పూర్తి సమయం ఇంట్లో (లోకేష్ తో కలిసే) ఉండటంతో… పూర్తి లోకేష్ గా మారారని తాజాగా బాబు చేస్తున్న పనులు క్లారిటీ ఇస్తున్నాయి! ఏదైనా సమస్య వస్తే… దానిపై అర్ధవంతమైన చర్చ పెట్టడమో లేక లాజికల్ గా మాట్లాడి, తన వయసుకి, అనుభవానికి గౌరవం తెచ్చుకోవడమో చేయడం మానేసిన బాబు… ట్విట్టర్ లో ఒక ఫోటో పెట్టడం, వీడియో కాంఫరెన్స్ లో పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెప్పివెళ్లిపోవడం.. పాడిందే పాడరా పాసిపల్ల దాసన్న అన్నట్లు… నెలరోజులనుంచి చేస్తున్న విమర్శలనే తిప్పి తిప్పి వాయించడం బాబు స్థాయికి తగదు అనేదే బాబు ఫాలోవర్స్ సమస్య! ఇదే జరిగితే మాత్రం… పార్టీ పరిస్థితి మంగలగిరి మాన్యాలకే అనే విషయం చంద్రబాబు మరిచిపోకూడదు!

ఎందుకంటే… చిల్లర విమర్శలు చేయడానికి అనిత, యామిని లాంటి వారు.. అడ్డగోలు వాదనలకు దేవినేని ఉమ, బోండా ఉమ లాంటి వారు.. విత్ అవుట్ బ్రెయిన్ ఒళ్లేసుకుని పడిపోవడానికి అచ్చన్నా, యనమలన్నా… కార్యకర్తలు పంపే ఫోటోలు, సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఫోటోలపై ట్విట్టర్ లో కామెంట్స్ చేయడానికి లోకేష్ వంటివారు ఉండగా… బాబు కూడా వారు చేసే పనులే చేస్తే… ఇంక ఈ అనుభవం ఎందుకు? మోస్ట్ సీనియర్ అని చెప్పుకోవడం ఎందుకు? బాబే ఆత్మపరిశీలన చేసుకోవాలి!!

Read more RELATED
Recommended to you

Latest news