జనసేన ఎమ్మెల్యే రాపాక‌పై.. శ్రీరెడ్డి ‘కేక’ పోస్ట్ చూశారా..?

187

న్యూస్ రీడర్, యాంకర్, హోస్ట్, ఫిలిం యాక్టర్ శ్రీరెడ్డి గురించి.. ఆమె చేస్తున్న పోరాటాల గురించి సోషల్ మీడియాలో చాలా చూశారు. టీవీ డిబేట్లలోనూ.. లైవ్ షోల్లోనూ చాలా తెల్సుకున్నాం. శ్రీరెడ్డి లీక్స్ కూడా చాలా పాపులర్ అయిపోయాయి. ఇక ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రిని టార్గెట్ చేస్తూ వార్త‌ల్లో నిలుస్తుంటుంది శ్రీ‌రెడ్డి. తాజాగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మీద నటి శ్రీరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన ఫేస్ బుక్ ఖాతాలో వరప్రసాద్ మీద ఓ కామెంట్ పోస్ట్ చేసింది. ‘రాపాక మీరు కేక’ అని కామెంట్స్ పోస్ట్ చేసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వికేంద్రీకరణ బిల్లుకు రాపాక వరప్రసాదరావు అసెంబ్లీలో మద్దతు పలికారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను వ్యతిరేకించాలని, ఒకవేళ దానిపై ఓటింగ్ నిర్వహిస్తే అందుకు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ పవన్ కళ్యాణ్ రాపాక వరప్రసాద్‌కు బహిరంగ లేఖ రాశారు. అయితే, అధినేత లేఖను లైట్ తీసుకున్న రాపాక వరప్రసాద్ తాను మాత్రం వికేంద్రీకరణ బిల్లుకు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే శ్రీరెడ్డి రాపాక వరప్రసాద్ మీద ‘రాపాకా.. మీరు కేక’ అని కామెంట్ పోస్ట్ చేసింది.