సీఎం జగన్ కు గుడి కట్టిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గుడి కట్టారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఉన్న ప్రేమ మరియు ఆయన అమలు చేస్తున్న నవరత్నాల పేరుతో దేవాలయాన్ని నిర్మించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. రైతు భరోసా, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ మరియు అమ్మ ఒడి పేరుతో భారీ స్తూపాలు నిర్మించారు.

అలాగే పేదలకు ఇండ్లు, ఫీజు రియంబర్స్మెంట్, మరియు జలయజ్ఞం పథకాల పేరుతో స్థూపాలను నిర్మించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఇక నవరత్నాల సృష్టికర్త అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సుమారు రెండు కోట్ల ఖర్చుతో ఈ దేవాలయాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నిర్మించారని తెలుస్తోంది.  దేశంలో ఎక్కడా లేని పథకాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని… వైసీపీ ప్రభుత్వం లో ఏపీ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని కొనియాడారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.