మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా తర్వాత ఆయన సొంత నియోజకవర్గమైన హుజురాబాద్ లో ఎన్నిక అనివార్యమైంది సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఇటు బిజెపి, కాంగ్రెస్ అటు అధికార టీఆర్ఎస్ పార్టీ కసరత్తులు మొదలు పెట్టాయి. అయితే కాంగ్రెస్ పార్టీ… మాత్రం బీజేపీ మరియు అధికార టీఆర్ఎస్ పార్టీ తరహాలో దూసుకుపోతున్న ట్లు కనిపించడం లేదు.
ఇక టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించగా… కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ అభ్యర్థి ప్రకటన పై కీలక చర్చ నిర్వహించింది. అయితే ఈ చర్చల్లో…. పలువురు నాయకుల పేర్లు వినిపించినప్పటికీ… కొండా సురేఖ ను హుజురాబాద్ అభ్యర్థిగా నిలపాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే ఈ విషయం పై హుజురాబాద్ కు చెందిన పలువురు నాయకులతో… చర్చించిన కాంగ్రెస్…. ఇవాళ సాయంత్రం లోపు కొండా సురేఖ పేరు ను ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దుబ్బాక తరహాలో… సమయం వృధా చేయకూడదని నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.