ఇప్ప‌టికీ వైసీపీలో ఆ నేతే హీరో…!

-

వైవీ సుబ్బారెడ్డి. ప్ర‌కాశం జిల్లా ఒంగోలు మాజీ ఎంపీ. గ‌తంలో అంటే.. గ‌త ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు ఆయ‌న ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో క్ష‌ణం తీరిక లేకుండా చ‌క్రం తిప్పారు. అయితే.. ఆయ‌న‌పై తీవ్ర వివాదాలు, విమ‌ర్శ‌లు రావ‌డంతో జిల్లా నేత‌ల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల ఆధారంగా జ‌గ‌న్ ఆయ‌న‌ను త‌ప్పించారు. ఎంపీ సీటు కోసం ఆయ‌నఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. ఆఖ‌రుకు కుటుంబ స‌భ్యుల‌తో చెప్పించినా.. అలిగి కొన్నాళ్లు దూరంగా ఉన్నా.. జ‌గ‌న్ ఆయ‌న‌కు ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. సీటు ద‌క్క‌లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను రాజ‌కీయాల‌తో సంబంధం లేని టీటీడీ బోర్డు చైర్మ‌న్ ప‌ద‌విని అప్ప‌గించారు.

దీంతో వైసీపీలో చాలా మంది పండగ చేసుకున్నారు. హ‌మ్మ‌య్య మాకు భారం త‌ప్పింద‌ని అనుకున్నారు. కానీ, ఇప్పుడు అదే వైవీ.. పార్టీలో కీల‌కంగా మారారు. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. సీఎంజ‌గ‌న్ ముందు.. చెబుతున్న మాట‌.. విష‌యాన్ని వైవీ దృష్టికి ఎందుకు తీసుకు రాలేదు. అనే! ప్ర‌స్తుతం ఆయ‌న తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌కీయ వ్య‌వ‌హారా ల ఇంచార్జ్‌గా ఉన్నారు. పైకి ఒక జిల్లాకే ఇంచార్జ్‌గా ఉన్న‌ప్ప‌టికీ.. దాదాపు ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా వ్య‌వ‌హారాల‌ను కూడా ఆయ‌నే చూస్తున్నారు.

ఇది ఆయా జిల్లాల నాయ‌కులకు మింగుడు ప‌డ‌డం లేదు. రెండు రోజుల కిందటద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి.. మాజీ మంత్రి బోస్‌పై విరుచుకుప‌డ్డారు. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న జ‌గ‌న్‌.. విష‌య‌న్ని వైవీకి ఎందుకు చెప్ప‌లేద‌ని ప్ర‌శ్నించారు. ఇక, గుంటూరులో నూ ఇలాంటి వివాద‌మే వ‌చ్చింది. దీంతో ఈ విష‌యాన్ని కూడా వైవీ కి చెప్పాల‌నే అన్నార‌ట‌. మొత్తంగా చూస్తే. పైకి టీటీడీ బోర్డు చైర్మ‌న్‌గా చ‌క్రం తిప్పుతున్నా.. వైవీ ఇప్ప‌టికీ వైసీపీ హీరోనే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

దీంతో వైవీ వ‌చ్చే ఎన్నిక ల‌నాటికి మ‌రింత‌గా జిల్లాల్లో చ‌క్రం తిప్ప‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. తాజాగా ప్ర‌కాశం జిల్లాలోనూ పార్టీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. దీంతో వెనువెంట‌నే జోక్యం చేసుకోవాల‌ని.. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాల‌ని జ‌గ‌న్ వైవీని ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది. మొత్తంగా వైవీకి మ‌ళ్లీ రాజ‌కీయంగా మంచి రోజులు వ‌స్తున్నాయ‌ని ఆయ‌న వ‌ర్గం అంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news