తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ టిడిపిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి . అధికార పార్టీ మేరీగ మురళీధర్ కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో టిడిపి అలర్ట్ అయింది. మురళీధర్ పై బలమైన నేతను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తుందని టిడిపిలో ప్రచారం నడుస్తోంది.. 2019 ఎన్నికల్లో అప్పటి వైసిపి అభ్యర్థి వరప్రసాద్ చేతిలో పాశం సునీల్ ఓటమి పాలయ్యారు.. అప్పటి నుంచి నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు.. అతని పనితీరు సరిగా లేదంటూ ఇటీవల టిడిపి అధిష్టానం సైతం మండిపడిందట.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలను కలుపుకొని పోవడం లేదని.. ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో పార్టీలో చేరికలు కూడా లేవని అధినేత చంద్రబాబు సునీల్ కి చివాట్లు పెట్టారట..
పనితీరు మెరుగుపరుచుకోవాలని చంద్రబాబు ఆదేశించారని పార్టీలో చర్చ నడుస్తోంది.. ఈ వ్యవహారం సద్దుమనగకముందే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిని మార్చడంతో సునీల్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు.. మురళీధర్ కు నియోజకవర్గంలో మంచి పేరు ఉండటంతో పాటు.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు అందరూ ఆయనకు మద్దతుగా ఉంటారు.. దీంతో ఆయనపై పోటీ చేసేందుకు సునీల్ సరిపోరు అనే భావన అధినేతకు వచ్చిందట.. ఈ క్రమంలో పాశం సునీల్ స్థానంలో పనబాక లక్ష్మీ గాని లేదా ఆమె భర్త పనబాక కృష్ణయ్యను గాని బరిలోకి దించాలని టిడిపి కసరత్తు చేస్తోందని గూడూరు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది..
నాలుగున్నర ఏళ్ల పాటు పార్టీని నమ్ముకుని ఉన్న తనకు కీలక సమయంలో టికెట్ ఇవ్వకపోతే అధిష్టానాన్ని ఇబ్బంది పెడతానని సునీల్ తన అనుచరుల వద్ద చెబుతున్నారట.. చంద్రబాబు మాత్రం నమ్మిన వారి కంటే పార్టీ ఫండ్ ఇవ్వడంతో పాటు బలమైన నేతలని బరిలోకి దింపాలని ఆలోచన చేస్తున్నారని ఎన్టీఆర్ భవన్ వర్గాల విశ్వసనీయ సమాచారం. గూడూరు టిడిపి టికెట్ ఫైనల్ గా ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.