ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ – స్థానిక సంస్థల ఎలక్షన్ పై స్టే..!!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన 176పై కూడా స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ పంచాయితీ ఎన్నికల్లో 59.85 శాతాం రిజర్వేషన్ కల్పించడాన్ని తప్పుపట్టింది. దీనిపై నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాలని హైకోర్టుకు సుప్రీం ఆదేశించింది. గతంలో హైకోర్టు లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించిన ఏపీ సర్కార్ పై దాఖలు చేసిన పిటిషన్ పై పట్టించుకోకపోవడంతో సదరు పిటిషనర్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం ఆశ్రయించడంతో వెంటనే ఏపీ సర్కార్ ఇచ్చిన జీవో 176పై స్టే విధించింది.

 

మామూలుగా అయితే ఈ నెల 17వ తారీఖున పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ఎన్నికల కమిషన్ సిద్ధపడింది. ఇటువంటి తరుణంలో తాజాగా ఏపీ సర్కార్ నిర్దేశించిన రిజర్వేషన్లను తప్పు పట్టిన సుప్రీం ఈ విషయంపై హైకోర్టు నాలుగు వారాల్లో విచారణ చేపట్టాలని ఆదేశించడంతో రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news