జానారెడ్డి చాలా మంచి వ్యక్తి… అందుకే తిట్టలేదు: మంత్రి

నాగార్జున సాగర్ లో కచ్చితంగా 20 వేల మెజారిటీ తో గెలుస్తామని చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జానారెడ్డికి మంచి పేరుంది, ఆయన్ను విమర్శిస్తే ప్రజలు ఒప్పుకోరు అని అన్నారు. అందుకే మేము కాంగ్రెస్ ను టార్గెట్ చేసి విమర్శలు చేశాం అని తెలిపారు. కరోనా గాలిలో కూడా వస్తుంది అని తెలియడం లేదు అన్నారు. సాగర్ ప్రచారం లో పాల్గొన్న వారిలో 193మందికి వచ్చింది అని వివరించారు.

కరోనా వల్ల దేశమే ఇబ్బందుల్లో ఉందన్న ఆయన మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని స్పష్టం చేసారు. ప్రైవేట్ హాస్పిటల్స్ మానవత్వంతో ఆలోచించాలి అని కోరారు. మున్సిపల్ ఎన్నికల పై ఎన్నికల సంఘానిదే అంతిమ నిర్ణయం అని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ పై కేంద్రం తీరు సరిగా లేదు అన్నారు. వ్యాక్సిన్ రేటు కేంద్రానికి, రాష్ట్రానికి ఒక్కో రేటు ఎలా ఉంటుంది అని మండిపడ్డారు. దేశంలో ఉద్యోగుల జీతాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం మనదే అని ఆయన పేర్కొన్నారు.