చిన్నమ్మకు భారీ షాక్‌..?

-

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత స్నేహితురాలైన శశికళ, రాష్ట్రంలో అడుగు పెట్టిన ఒక్కరోజులోనే అక్కడి ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ఆమెకు సంబంధించిన ఆస్తులు రాష్ట్రంలో ఎక్కడెక్కడా ఎన్ని ఉన్నాయో గుర్తించి తాము జప్తు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలై చెన్నైకు చేరుకున్న శశికళలకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వాగతంలో రాష్ట్రంలోకి అడుగు పెట్టించారు. ఆమె వచ్చి 24 గంటల్లోపై ఆస్తులు తామ ఆ«ధీనంలోకి తీసుకున్నట్లు ఉత్తర్వులు జారీచేసి భారీ షాక్‌ ఇచ్చారు.

అన్నా డీఎంకే నాదే..

ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ..అన్నాడీఎంకే తనదే.. జయలలిత వారసురాలిని నేనే, ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు శశికళ సంచలన ప్రకటన చేశారు. ఆమె చేసిన ప్రకటనతోనే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి, వందల కోట్ల ఆస్తులను జప్తు చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు మేరకు తుత్తుకుడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 800 ఎకరాల భూములను ప్రభుత్వం తన ఆ«ధీనంలోకి తీసుకుంది. అంతేకాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే ఎన్నోకోట్లు విలువచేసే భూములు, ఆస్తులను జప్తు చేసింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములన్నీ ఇలవరసీ సుధాకరణ్‌ పేరుపై ఉన్నట్లు తెలిసింది. ఆస్తుల జప్తు తీర్పు నాలుగేళ్ల క్రితం వెలువరించింది.

Read more RELATED
Recommended to you

Latest news