ఖమ్మంలో టీడీపీ యాక్టివ్..నష్టం ఎవరికి?

-

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి అయిపోయింది..అందులో ఎలాంటి డౌట్ లేదు.గత ఎన్నికల్లో రెండు సీట్లు గెలుచుకుని కనీసం ఉనికి చాటుకుంది. కానీ ఈ సారి ఆ పరిస్తితి లేదు. ఒక్క సీటు గెలుచుకునే బలం టి‌డి‌పికి లేదు..టి‌డి‌పి ఓటింగ్ దాదాపు బి‌ఆర్‌ఎస్‌కు వెళ్ళగా, కొంత కాంగ్రెస్ వైపు కూడా వెళ్లింది. అయితే తెలంగాణలో టి‌డి‌పి లేదా? అంటే ఇంకా ఆ  పార్టీని అభిమానించే వారు ఉన్నారు. టి‌డి‌పి పోటీలో ఉంటే ఓట్లు వేసేవారు ఉన్నారు. కాకపోతే అది గెలుపు వరకు వెళ్లదు.

కానీ కొంతవరకు ఓట్లు చీల్చి గెలుపోటములని ప్రభావితం చేయవచ్చు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కాస్త ప్రభావం ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ఖమ్మంలో టి‌డి‌పి కాస్త యాక్టివ్ గా ఉంది.ఇక్కడ చంద్రబాబు జరిగిన దగ్గర నుంచి టి‌డి‌పి శ్రేణులు యాక్టివ్ గానే పనిచేస్తున్నాయి. ఇటీవల ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ ఇనచార్జ్‌గా సీనియర్‌ నేత వాసిరెడ్డి రామనాథంతో పాటు ఆ కమిటీలో మరికొందరిని నియమించారు.

ఇలా ఖమ్మలో టి‌డి‌పి ఉనికి చాటుకునే విధంగా ముందుకెళుతుంది. అయితే గత ఎన్నికల్లో ఖమ్మంలో సత్తుపల్లి, అశ్వరావుపేట సీట్లని టి‌డి‌పి గెలుచుకుంది. గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్లారు. అయితే ఈ సారి టి‌డి‌పి పోటీ చేయడానికి రెడీ అవుతుంది. ఒంటరిగా పోటీ చేస్తుందా? పొత్తులో పోటీ చేస్తుందా? అనేది క్లారిటీ లేదు.

అయితే ఎలా చూసుకున్న ఖమ్మంలో టి‌డి‌పికి కాస్త ఓటు బ్యాంకు ఉంది. గెలిచే సత్తా లేదు ..కానీ ఇతర పార్టీల గెలుపోటములని ప్రభావితం చేస్తుంది. అయితే టి‌డి‌పి వల్ల ఏ పార్టీకి నష్టం అనేది తేలేలా లేదు. ఎందుకంటే అక్కడ టి‌డి‌పి ఓటర్లే బి‌ఆర్‌ఎస్ వైపు వెళ్లారు. ఇప్పుడు టి‌డి‌పి పోటీ చేస్తే..ఆ పార్టీపై అభిమానంతో కొందరు ఓట్లు వేస్తే..బి‌ఆర్‌ఎస్‌కు ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని టి‌డి‌పి చీలిస్తే కాంగ్రెస్‌కు నష్టం. చూడాలి మరి ఈ సారి టి‌డి‌పి ప్రభావం ఎంత ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version