బలవంతపు, అక్రమ ఏకగ్రీవలపై చర్యలు తీసుకోక పోవడాన్ని తప్పుపడుతూ పరిషత్ ఎన్నికలు బహిష్కరించింది టీడీపీ. బలవంతపు, అక్రమ ఏకగ్రీవలపై చర్యలు తీసుకోక పోవడాన్ని తప్పు పట్టిన చంద్రబాబు సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. స్థానిక ఎన్నికల చరిత్రలోనే ఈ స్థాయి ఏలగ్రీవాలు ఎప్పుడు జరగలేదని జగన్ అంత పోటుగాడా అని మండిపడ్డారు టీడీపీ అధినేత. 2014లో 2శాతం ఎకగ్రీవాలైతే 2020లో 24శాతం బలవంతపు ఏకగ్రీవాలు పెరిగాయన్నారు. ఎన్నికల బహిష్కరణ కఠిన నిర్ణయమే అయినా పొలిట్ బ్యూరో లో నిర్ణయం మేరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
అసలు ఎన్నికలు పెట్టే అర్హత కొత్త ఎస్‌ఈసీకి ఉందా అని నిలదీశారు చంద్రబాబు. స్థానిక ఎన్నికలు రాజ్యాంగ బద్ధంగా జరగలేదని తప్పుబట్టారు. ఎన్నికల తేదీల పై ముందే సీఎం, మంత్రులు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని, నిబంధనలు పక్కనపెట్టి ఎన్నికలు జరుపుతున్నారని దుయ్యబట్టారు. తాజా పరిస్థితుల్ని చూస్తుంటే కఠిన నిర్ణయాలు తప్పట్లేదని చెప్పారు. పోటీ చేస్తామంటే వేదింపులు,బెదిరిపులకు గురి చేస్తున్నారన్నారు. ఎస్ఈసీ తీరును తప్పు పడుతూ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.