ఆ విషయం జగన్ ప్రభుత్వానికి అతి పెద్ద షాక్ ఇస్తుందా?

-

ఏపీలో అధికారంలో జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష టీడీపీ నిత్యం విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. నిత్యం ఏదొక అంశంపై టీడీపీ, జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తుంది. కానీ టీడీపీ టార్గెట్ చేయడం వల్ల, జగన్ ప్రభుత్వానికి పెద్దగా నెగిటివ్ ఏం రాలేదని, ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలు రుజువు చేశాయి. కానీ ప్రతిపక్షం చేయలేని పని, నిరుద్యోగులు చేసేలా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.

Ys-Jaganmohan-Reddy
Ys-Jaganmohan-Reddy

పార్టీలతో సంబంధం లేకుండా విద్యార్ధులు ఉద్యమిస్తున్నారు. ఇక వారికి ప్రతిపక్ష పార్టీలు అండగా నిలబడి, రాష్ట్రంలో రాజకీయాన్ని మరింత వేడెక్కేలా చేస్తున్నారు. పది వేల ఉద్యోగాలతో క్యాలెండర్ ఇచ్చి, నిరుద్యోగులని మోసం చేసిన ప్రభుత్వం, పూర్తిగా ఖాళీలు ఉన్న ఉద్యోగాలని క్యాలెండర్‌లో పెట్టి మళ్ళీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీ నాయకులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు.

అసలు క్యాలెండర్‌లో గ్రూప్ ఉద్యోగాలు 36, పోలీస్ ఉద్యోగాలు కేవలం 450 పెట్టడంపై పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. ఇక క్యాలెండర్‌లో డి‌ఎస్‌సి ఊసు లేని లేదు. దీంతో నిరుద్యోగులు రోడ్డు ఎక్కారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు.

అయితే ఇలా నిరుద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉండటం వల్ల, అది జగన్‌కే నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే ప్రభుత్వం ఇప్పటికే ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతుందని, అవి ఎలాంటి ఉద్యోగాలో చెప్పాల్సిన పని లేదని అంటున్నారు. సీఎం జగనే స్వయంగా ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి, క్యాలెండర్‌లో 450 పెట్టడం ఏంటని? ఈ అంశాలన్నీ జగన్ ప్రభుత్వానికి నెగిటివ్ అవుతాయని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news