చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రాష్ట్రంలో టిడిపి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టిడిపి ఏర్పడి 40 సంవత్సరాల పైనే అయింది. అందులో ఉన్న నాయకులు కూడా పార్టీ ఏర్పడినప్పుడు నవ యువకులుగా ఉత్సాహంతో పార్టీలో చేరి, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన వారే. ఇప్పుడు లోకేష్ కు అండదండగా ఉండడానికి అటువంటి యువకులు కావాలని రాజకీయ వర్గాలు అంటున్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత లోకేష్ ఢిల్లీలో ముఖ్య నేతలను కలుస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చర్చిస్తున్నారు. ఆ సమయంలోనే ఒక ప్రత్యేక సంస్థకు రాష్ట్రంలో టిడిపి పరిస్థితి ఏంటి?ఎన్నికల్లో టిడిపి గెలవాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి ఒక సర్వే నిర్వహించమని ఒక సర్వే సంస్థను కోరారు. ఆ సర్వేలో వచ్చిన రిపోర్ట్ సారాంశం ఏంటంటే టిడిపి స్థాపించినప్పటి నుండి టిడిపిలో ఉన్న నాయకుల వల్ల పార్టీకి ఉపయోగం లేదని, వారి వల్ల టిడిపి లాభపడకపోగా నష్టపడే అవకాశాలు ఉన్నాయని, వారిని ఉంచి వేరే పదవి ఇవ్వాలని ఈసారి ఎమ్మెల్యేగా అవకాశాలు ఇవ్వకూడదని ఆ సర్వే రిపోర్ట్ ఇచ్చింది.
నాయకత్వ మార్పు గురించి చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళకముందే చర్చించారని లొకేష్ అంటున్నారు. సీనియర్ నాయకులలో ఒక 40 మందిని పక్కనపెట్టి కొత్తవారిని తీసుకొని పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపాలని రాజకీయ వర్గాలు సర్వేలు సూచిస్తున్నాయి. అలా చేస్తే టిడి,పి జనసేన పార్టీ వల్ల విశాఖ, కృష్ణ, ఉభయ గోదావరి, ప్రకాశం, అనంతపురం జిల్లాలలో టిడిపి హవా కొనసాగే అవకాశం ఉందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి.
నాయకత్వ మార్పు అంటే సీనియర్లు చూస్తూ ఊరుకోరని ఒక వర్గం వారు అంటున్నారు. ఎప్పటినుంచో పార్టీలో ఉండి 4, 5 సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసి జిల్లా ఇన్చార్జిలుగా ఉన్న నాయకులను పక్కన పెడితే వారు ప్రతిపక్షం కన్నా ప్రమాదమని అంటున్నారు. వారికి వేరే పదవి ఇచ్చి లేదా బుజ్జగించి లేదా వారి స్థానాలను జనసేన వారిని నిలబెట్టి ఈసారి వారికి ఎమ్మెల్యేలు టికెట్లు ఇవ్వకుండా జాగ్రత్త పడాలని రాజకీయ వర్గాల వారు అంటున్నారు.
టిడిపి, జనసేన పొత్తు నేపథ్యంలో నాయకత్వ మార్పు, కార్యకర్తలు గట్టిగా పని చేస్తే ఇప్పుడున్న పరిస్థితులలో ఈసారి టిడిపి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.