ఈమె కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేవాళ్లు వైకాపా లో లేరా ?

తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కి వచ్చిన నాటి నుండి చాలామంది పార్టీకి నమ్మకమైన నాయకులు దూరమయ్యారు. కానీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాత్రం చాలా యాక్టివ్ గా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉంటూ అధికార పార్టీ వైసీపీ ని చెడుగుడు ఆడేసుకుంటున్నారు అనురాధ. తెలుగుదేశం పార్టీ తరుపున బలమైన నాయకులు ఎవరు కూడా మీడియా ని ఎదురుకొని సమయములో పంచుమర్తి అనురాధ వైసీపీ నేతలకు దిమ్మ తిరిగిపోయే విధంగా సమాధానాలు కౌంటర్లు వేస్తున్నారు. Image result for panchumarthi anuradha

దీంతో అనురాధ చేస్తున్న విమర్శలకు కౌంటర్లు వేయలేక ఆమె వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ వైసీపీ నేతలు మీడియాలో సోషల్ మీడియాలో నవ్వులపాలు అవుతున్నారు.  ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఆమెకు క్యాన్సర్ సోకింది జుట్టు ఊడిపోయి విగ్గు పెట్టుకుంటున్నారు అంటూ నీకు జుట్టే లేదనుకున్నాం… మెదడు కూడా లేదని వింత వింత సెటైర్లు వేస్తున్నారు.

 

దీంతో వైసిపి పార్టీ నాయకులు టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ పై చేస్తున్న వ్యాఖ్యలను సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో విభేదిస్తున్నారు. ఒక లేడీ పొలిటీషియన్ ని పైగా క్యాన్సర్ వ్యాధి గెలిచిన నాయకురాలి పై స్ట్రాంగ్ కౌంటర్లు రాజకీయంగా వేయకుండా ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం దారుణమని విమర్శలు చేస్తున్నారు. ఆమె వేసే ప్రశ్నలకు కౌంటర్లు వేసేవాళ్ళు వైసీపీ పార్టీలో లేరా అని మరికొంతమంది నెటిజన్లు వైసీపీ నేతలకు ప్రశ్నలు వేస్తున్నారు. ప్రతిపక్షంగా ఆమెకు ప్రశ్నించే హక్కు ఉంది అధికార పక్షం గా మీరు దానికి సమాధానం చెప్పాలి. కానీ ఇలా ఆడదాని పై ఇష్టానుసారంగా నోరు పారేసుకోవటం మంచిది కాదని స్ట్రాంగ్ గా వైసీపీ నేతలకు నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.