జగన్ టైం, ప్లేస్ చెప్పమని సవాల్ చేసిన టీడీపీ మహిళా నేత…!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ సవాల్ చేసారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేసారు. క్రిమినల్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి మీద బహిరంగ చర్చకు సిద్దమా? టైం, ప్లేస్ మీరు చెబుతారా? మమ్మల్ని చెప్పమంటారా? ఆమె సవాల్ చేసారు. 87% వైకాపా నేతల్లో క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆమె ఆరోపించారు.

మీ మీద అవినీతి కేసులన్నాయని మా మీద కూడ అవినీతి మరకలు రుద్దే ప్రయత్నం వైకాపా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఐటీ దాడుల్లో రూ.2వేల కోట్లు దొరికాయని వైకాపా నాయకులు డప్పులు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేసారు. వాటికి మాకు ఏం సంబంధం ఉంది? అని ప్రశ్నించారు. ఏమీ లేకపోయినా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 38 వారాల నుంచి జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకాకుండా కుంటి సాకులు చెబుతన్నారన్నారు.

ఈ రోజు కూడా జగన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా అమిత్ షాను కలవాలంటూ ఢిల్లీ చుట్టు చకర్లు కొడుతున్నారని ఎద్దేవా చేసారు. రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిపై 26 ఎంక్వైరీలు వేసి ఏం చేయలేకపోయారని గుర్తు చేసారు. చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ఆస్తులను క్రమం తప్పకుండా ప్రతి యేడాది ప్రకటిస్తున్నారు కాబట్టి జగన్ కు దమ్ముంటే ఆస్తులను ప్రకటించాలని సవాల్ చేసారు.