వ్యూహం సినిమాపై పచ్చనేతలు కడుపు మంటను బయటపెట్టుకున్నారు. వ్యూహం సినిమాను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేశారు. సినిమా పోస్టర్‌లను తగులపెట్టి గూండాయిజాన్ని చాటుకున్నారు.రాంగోపాల్ వర్మను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. వ్యూహం సినిమాను విడుదల చేస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేస్తూ ఆందోళనకు దిగారు.సమాచారం అందుకున్న పోలీసులు ఆర్‌జీవీ ఆఫీస్ వద్దకు చేరుకోగా టీడీపీ కార్యకర్తలు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు.
త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నాయి. దీంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి.ఎన్నికల్లో గెలుపోటములపై ఇప్పటికే అనేక పార్టీలు సర్వేలు చేయించుకుని తదనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఏపీలో ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఈ సారి కూడా గెలవడం కష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీపై బురద చల్లే పని పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. చంద్రబాబు నుంచి గల్లీ లీడర్ల దాకా ఏదో ఒక సందర్భాన్ని అవకాశంగా తీసుకుని విమర్శలతో చెలరేగిపోతున్నారు. వీటన్నింటినీ గమనిస్తున్న ప్రజలు ఓ వైపు అసహ్యించుకుంటున్నా తెలుగుదేశం పార్టీ నేతలు వాటిని పట్టించుకోవడం లేదు.
పైగా తిరిగి జనాలపైనే విమర్శలు చేసే స్థాయికి వెళ్ళారు.రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి.కానీ చంద్రబాబు ఇతర అంశాలను కూడా రాజకీయానికి ముడిపెట్టి గందరగోళం సృష్టింస్తుంటారు.ఇదే క్రమంలో సినీ దర్శకులు రాంగోపాల్ వర్మ ఇంటిపైకి తన కార్యకర్తలను పంపారు. వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం సినిమా త్వరలో థియేటర్లలోకి విడుదల కాబోతోంది.ఈ సినిమా విడుదలైతే వైసీపీకి సానుకూల పవనాలు ఏర్పడతాయనే ఆలోచనతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్‌జివి ఆఫీస్ వద్ద నానా గందరగోళం సృష్టించారు.ఎదురుగా ఆర్‌జీవి కనిపిస్తే కొట్టాస్తారేమో అనేలా బిల్డప్ ఇచ్చారు. చివరికి పోలీసులు ఎంటర్ కావడంతో అక్కడి నుంచి పారిపోయారు.
ఈ సంఘటనపై వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ మాట్లాడుతూ సినిమాను సినిమాలాగే చూడాలన్నారు. సెన్సార్‌బోర్డ్ సర్టిఫై చేశాక టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడటం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ సినిమాను రిలీజ్ చేయనీకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అసహనం వ్యక్తపరిచారు.టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు చేయడం,దాడులకు దిగడం సరికాదని దీనిని ఖండిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వ్యూహం సినిమాను ఖచ్చితంగా విడుదల చేస్తామని స్పష్టం చేశారు.