టీడీపీ ఆ మంత్రులంతా ఓడిపోతారట..!

ఎమ్మెల్సీ మంత్రులు.. నారా లోకేశ్, సోమిరెడ్డి, నారాయణ కూడా ఓడిపోబోతున్నారట. నారాయణ ఈసారి ఎన్నికల్లో భాగానే ఖర్చు పెట్టారట కానీ.. ఎన్నికల సమయంలో పరిస్థితులు మారాయట.

టైటిల్ చదివి షాకయ్యారా? మీరు షాక్ అయినా.. అవ్వకపోయినా ఇది నిజం. అయితే.. ఇదేదో మేం చెబుతున్నది కాదు. రాజకీయ విశ్లేషకుల మాట. ఏపీలో టీడీపీ మంత్రులంతా ఓడిపోతారట. వాళ్లలో ముందు వరుసలో ఉండేది ఫిరాయింపుల ద్వారా టీడీపీలోకి వచ్చిన అఖిల ప్రియ, అమర్ నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి.

వీళ్లు ముగ్గురు ఓడిపోవడం ఖాయమట. ఈసారి ఆదినారాయణ రెడ్డి ఎంపీగా పోటీ చేశారు. అయితే.. ఆదినారాయణ రెడ్డి పోటీ చేసిన నియోజకవర్గం టీడీపీకి వ్యతిరేకంగా ఉందట. దీంతో ఆదినారాయణ రెడ్డి ఓడిపోవడం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు అఖిలప్రియకు సంత నియోజకవర్గంలోనే ఎదురు గాలి విచిందట. దీంతో ఆమె పరిస్థితి కూడా అంతంత మాత్రమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అమర్ నాథ్ రెడ్డి పని కూడా అయిపోయినట్టేనంటున్నారు.మరోవైపు ఎమ్మెల్సీ మంత్రులు.. నారా లోకేశ్, సోమిరెడ్డి, నారాయణ కూడా ఓడిపోబోతున్నారట. నారాయణ ఈసారి ఎన్నికల్లో భాగానే ఖర్చు పెట్టారట కానీ.. ఎన్నికల సమయంలో పరిస్థితులు మారాయట. నెల్లూరు సిటిలో గాలి అనిల్ యాదవ్ వైపు మళ్లిందట. దీంతో నారాయణ గెలవడం కష్టమేనంటున్నారు. సోమిరెడ్డి కూడా ఓడిపోతారట. ఇక.. నారా లోకేశ్ పరిస్థితి కూడా అటూ ఇటూ ఉందట. అచ్చెన్నాయుడు పని కూడా ఔటేనట. ఇలా.. చంద్రబాబు కేబినేట్లో ఉన్న అందరు మంత్రులకు ఈసారి ఓటమేనట. కేబినేట్ మంత్రులే ఇలా ఓటమి బాట పడితే.. మిగితా అభ్యర్థుల సంగతి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.