తెలంగాణా బిజెపిలో ముసలం…!

-

తెలంగాణలో బలపడాలి అని భావిస్తున్న భారతీయ జనతా పార్టీకి ఆ నేతల వ్యవహార శైలి ఇప్పుడు ఇబ్బందిగా మారింది. రాజకీయ౦గా కేంద్రంలో బలంగా ఉన్న ఆ పార్టీ తెలంగాణలో కూడా తన బలం పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో హిందూ ఓటు బ్యాంక్ ఎక్కువగానే ఉండటంతో పాటుగా మహారాష్ట్ర సరిహద్దు కావడంతో కాస్త ఉత్తరాది పాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటాయి. దీంతో తెలంగాణలో బలపడే విధంగా ఆ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీకి కొందరు కీలక నేతలు షాక్ ఇస్తున్నారు.

ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దీనిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అసహనం గా ఉన్నారట. కనీసం తను ఒక్క మాట కూడా సంప్రదించకుండా బిజెపి అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని బండి సంజయ్ కేవలం ఒక నియోజక వర్గానికి మాత్రమే పరిమితమైన నేత అని తాను… నిజామాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో కూడా ప్రభావం చూపిస్తా అని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయారట. ఆయన ఎంపీగా ఉండి కూడా కరీంనగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేదని,

తాను టిఆర్ఎస్ పార్టీకి నిజామాబాద్ జిల్లాలో గట్టి పోటీ ఇచ్చా అని ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. రాష్ట్ర పార్టీలో ఇంత మంది సీనియర్ నేతలు ఉండగా ఒక యువనేతకు ఆ పదవి ఇవ్వటం తప్పుడు సంకేతాలు తీసుకు వెళుతుందని ఆయన అసహనం వ్యక్తం చేశారట. తాము ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తానని కనీసం తనను సంప్రదించకుండానే ఒక్క మాట కూడా అడగకుండా ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు అనే దానిని పెద్దల ముందు ఉంచుతానని స్పష్టం చేశారట అరవింద్. మరి ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news