గ్రేటర్ వార్ : కేసీఆర్ టెన్షన్ .. వారు అటెన్షన్ ?

-

గతంలో ఎప్పుడూ లేనంతగా తెలంగాణ సీఎం కేసీఆర్ టెన్షన్ పడుతున్నారు. ఫలితాలపై ఎప్పుడూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రేకెత్తిస్తూ, ప్రజల్లో ఆసక్తి కలిగిస్తూ, ప్రతి ఎన్నికలలోనూ విజయం వైపు అడుగులు వేయిస్తూ, తమకు తిరుగులేకుండా చేసుకుంటూ వచ్చిన కేసీఆర్ కు ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలలో ఫలితం ఎలా ఉండబోతోంది అనే టెన్షన్ పట్టుకుంది. ఒకవేళ ఫలితాలు కనుక టిఆర్ఎస్ కు అనుకూలంగా లేకపోతే , ఆ తరువాత ఫలితం ఎలా ఉంటుంది అనేది కూడా కెసిఆర్ కు బాగా తెలుసు.అందుకే ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు.

అది కాకుండా అనూహ్యంగా బిజెపి తెలంగాణలో బలం పెంచుకోవడం కూడా కేసీఆర్ కు నిద్రలేకుండా చేస్తోందట.ఇప్పటికే పార్టీలో కొన్ని అసంతృప్తులు ఉన్నాయి ఫలితాలలో గనుక తేడా వస్తే బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కే అవకాశం ఉంది. అదీ కాకుండా తన కుమారుడు కేటీఆర్ ప్రస్తుతం గ్రేటర్ బాధ్యతలు మొత్తం మోస్తున్నారు. త్వరలోనే ఆయన తెలంగాణ సీఎం గా కూడా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అందుకే కెసిఆర్ అన్ని అడుగులు చాలా జాగ్రత్తగా వేస్తున్నారు. ఇప్పటికే టికెట్ల కేటాయింపు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సిట్టింగ్ కార్పొరేటర్లు, అసంతృప్తిని ఎదుర్కొంటున్న 26 మందిని తప్పించి, వారి స్థానంలో కొత్త వారికి టికెట్లు కేటాయించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజలకు హామీలు ఇస్తూ, ప్రజలలో బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతం టిఆర్ఎస్ లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. అయితే కేసీఆర్ రాజకీయ బలం, ప్రత్యామ్నాయ పార్టీలు పెద్దగా ప్రభావం చూపించే స్థాయిలో లేకపోవడం, ఇవన్నీ లెక్కలు వేసుకుని అసంతృప్తి నాయకులు మౌనంగానే ఉంటూ వచ్చారు. అయితే ముందు ముందు ఆ పరిస్థితి కనిపించకపోతే, బిజెపి కనుక గ్రేటర్ దక్కించుకుంటే టిఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో బయటికి వచ్చే అవకాశం ఉందనే లెక్కలు బయటికి వస్తుండటంతో, కేసీఆర్ కాస్త టెన్షన్ పడుతున్నాడట. బిజెపి తెలంగాణలో బలం పుంజుకున్నా, టిఆర్ఎస్ బలం తగ్గినా, అది రాజకీయ పెను విపత్తులకు దారితీస్తుంది అనే ఆందోళన ఉండగా, బిజెపి మాత్రం ఉరకలెత్తే ఉత్సాహంతో గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తోంది.

కేంద్ర మంత్రులు, ప్రజల్లో బలంగా ఉన్న నాయకులను ప్రచారానికి దింపి, పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఈనెల 28న కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. అదేరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ ను సందర్శించబోతున్నారు. దీని వెనుక రాజకీయం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉండడం వంటి కారణాలు ఎన్నో ఇప్పుడు కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news