రాజీనామా లేఖ రెడీ చేసుకున్న ఉత్త‌మ్‌..!

-

పీసీపీ ప‌ద‌వికి ఎన్‌.ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేయ‌బోతున్నారా ?  తాను ప్రాతినిధ్యం వ‌హించిన హుజూర్‌న‌గ‌ర్‌లో త‌న భార్య‌నే గెలిపించుకోలేని ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి పీసీపీ ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు మొగ్గు చూతున్నారా..?  ఇప్పుడు ఇవే ప్ర‌శ్న‌లు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.
ఈరోజు ఢిల్లీలో జ‌రుగుతున్న కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి  ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వెళ్ళారు. పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం పూర్తి కాగానే  కాంగ్రెస్ నాయ‌కురాలు సోనియాగాంధీని కలిసి త‌న రాజీనామాను స‌మ‌ర్పిస్తార‌ని అంటున్నాయి కాంగ్రెస్ వ‌ర్గాలు.

పీసీపీ అధ్య‌క్షుడిగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో పూర్తిగా విఫ‌లం అయ్యారు. కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్ల కేటాయింపులోనే ఉత్త‌మ్ కుమార్ రెడ్డి గెలుపు గుర్రాల‌కు కాకుండా త‌న సామాజిక వ‌ర్గం వారికి, సంచులు మోసేవారికి, ఇచ్చేవారికి టికెట్లు పంచుకున్నార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్ హుజూర్‌న‌గ‌ర్ నుంచి, ఆయ‌న భార్య ప‌ద్మ‌వ‌తి కోదాడ నుంచి పోటీ చేశారు. ఉత్త‌మ్ హుజూర్‌న‌గ‌ర్ నుంచి గెలిచారు. కానీ ఆయ‌న భార్య కోదాడ‌లో ఓట‌మి చెందారు. ఇక‌ అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్తిగానే పీసీసీ ప‌ద‌వి నుంచి ఉత్త‌మ్‌ను త‌ప్పిస్తార‌ని అంతా అనుకున్నారు. కానీ కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జీ ఆర్ సి కుంతియా అండ‌తో పీసీసీ అధ్య‌క్ష‌ప‌ద‌విని కాపాడుకున్నారు.

అయితే ఇప్పుడు హుజూర్‌న‌గ‌ర్ రూపంలో ఆయ‌న ప‌ద‌వికి ఎస‌రు వ‌చ్చింది. ఆధిష్టానం సూచ‌న మేర‌కు హుజూర్ న‌గ‌ర్ ఎమ్మెల్యేగా ఉన్న ఉత్త‌మ్ న‌ల్ల‌గొండ ఎంపీగా పోటీ చేశారు. ఎంపీగా తాను గెలిపొందారు. హుజూర్‌న‌గ‌ర్‌లో ఉప ఎన్నిక‌లు రావ‌డంతో ఆ సీటులో త‌న భార్య ప‌ద్మావ‌తిని పోటీకి నిలిపారు. పీసీసీ కార్య‌నిర్వాహాక అధ్య‌క్షుడు, మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పోటీగా మ‌రో అభ్య‌ర్థి పేరును రంగంలోకి తీసుకొచ్చినా, చివ‌రికి కాంగ్రెస్ అధిష్టానంను ఒప్పించి, నా భార్య‌ను గెలిపించుకుని వ‌స్తాన‌ని మాటిచ్చార‌ట‌.

అయితే ఉప పోరులో టీఆర్ఎస్ అభ్య‌ర్థి సైదిరెడ్డి క‌నివిని ఎరుగుని రీతిలో భారీ మెజారిటీతో గెలుపొందారు. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 7వేల ఓట్ల‌తో ఉత్త‌మ్ గెలిస్తే… ఈ ఎన్నిక‌లో ఆయ‌న‌ భార్య మాత్రం 43వేల ఓట్ల‌తో ఓడిపోయారు. అంటే ఉత్త‌మ్ మీద వ్య‌తిరేక‌త తీవ్రంగా ఉందని తేలిపోయింది. ప‌ద్మావ‌తి ఓడిపోయిన నేపథ్యంలో నైతికంగా పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి తానే స్వ‌చ్ఛందంగా త‌ప్పుకుంటే గౌర‌వంగా ఉంటుంద‌ని భావించి రాజీనామా చేసేందుకు సిద్ద‌ప‌డిన‌ట్లు స‌మాచారం. త‌న రాజీనామా ప‌త్రాన్ని సోనియాగాంధీకి అందించ‌నున్నార‌ని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news