ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియను అరెస్ట్ చేసిన తెలంగాణా పోలీసులు

-

నిన్న అర్థరాత్రి సీఎం కేసీఆర్ బంధువులైన ప్రవీణ్‌రావు, సునీల్‌ రావు, నవీన్‌ రావులను కొందరు దుండగులు కిడ్నాప్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ కిడ్నాప్ వ్యవహారంలో కీలక అరెస్ట్ లు జరిగాయి. రాత్రి 7.30 సమయంలో ఐటీ అధికారులమంటూ వారి ఇంటి లోపలకు వెళ్ళిన కొందరు… ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరెడ్డి పేరును ప్రస్తావించారు అని వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత వారిని అక్కడి నుంచి బలవంతంగా తీసుకువెళ్ళారు అని, ఈ సమాచారం తెలుసుకున్న నార్త్‌జోన్‌ డీసీపి కల్మేశ్వర్, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అక్కడికి చేరుకొని డైమండ్‌ పాయింట్, రాణిగంజ్‌ మీదుగా రెండు అనుమానిత వాహనాలు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. నార్సింగి వద్ద కిడ్నాపర్లు బాధితులను వదిలి వెళ్ళారు. వికారాబాద్ సమీపంలో కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు.

అయితే కిడ్నాప్ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. హఫీజ్‌పేట్‌లోని భూ వ్యవహారమే ఈ కిడ్నాప్‌కు ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఏపీ మాజీమంత్రి భూమా అఖిలప్రియను కూడా పోలీసులు అదుపులోకి థేసుకునుఇ ఆమెను బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌ కు తరలించారు. ఇక ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఆమె భర్త భార్గవ్ పరారీలో ఉన్నారని సమాచారం. బాధితుల వాంగ్మూలం పోలీసులు రికార్డ్ చేసారు. ఇక ఈ కేసు భూమా అఖిల ప్రియ తల్లి తండ్రులు ఉన్న నాటి నుంచే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news