కేసీఆర్ కేబినెట్‌లో ఆ మంత్రికి టెన్ష‌న్ స్టార్ట్ …!

సరిగాలేని మంత్రులని పక్కనబెట్టి వారి స్థానాల్లో కొత్త వారిని తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి కేబినెట్ బెర్త్ ఖాయమని తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రిగా ఉన్న జగదీశ్‌ రెడ్డిని తప్పించి, గుత్తాకి కేబినెట్లో చోటు కల్పిస్తారని ప్రచారం జరుగుతుంది.

త్వరలో తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపడతారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.  డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచి రెండో సారి సీఎం అయిన కేసీఆర్, మొదట  మహ్మద్ అలీని హోమ్  మంత్రిగా తీసుకున్నారు. ఆ తర్వాత మూడు నెలలకి 10 మందితో మరోసారి మంత్రివర్గ విస్తరణ చేశారు. తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం 18 మందికి క్యాబినెట్‌లో చోటు కల్పించే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం సీఎంతో కలిపి 12 మంది ఉన్నారు. అంటే ఇంకో 6 ఖాళీలు ఉన్నాయి. ఇక ఆరు బెర్త్‌ల‌ని సీఎం త్వరలోనే పూర్తి చేస్తారని తెలుస్తోంది.

అలాగే పనితీరు సరిగాలేని మంత్రులని పక్కనబెట్టి వారి స్థానాల్లో కొత్త వారిని తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి కేబినెట్ బెర్త్ ఖాయమని తెలుస్తోంది. 2014లో నల్గొండ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన గుత్తా, ఆ తర్వాత గులాబీ పార్టీలోకి వెళ్లారు. అయితే 2018లో వచ్చిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చిన గుత్తా కొన్ని కారణాల వల్ల‌ పోటీ చేయలేదు. అలా అని పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు.

రాష్ట్ర కేబినెట్ లో చోటు దక్కించుకోవాలని గుత్తా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దిగలేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని గులాబీ బాస్ కూడా చెప్పారట. దీనికి సుముఖత వ్యక్తం చేసిన బాస్ కూడా ఓకే చెప్పారట. ఈ తరుణంలోనే కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డిపై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నిక‌ వచ్చింది. దీంతో ఆ ఎమ్మెల్సీ పదవి గుత్తాకి ఇవ్వాలని కేసీఆర్  ఫిక్స్ అయ్యారు. అలాగే ఎమ్మెల్సీ ప‌ద‌వికి గుత్తా నామినేష‌న్ కూడా వేశారు. కాంగ్రెస్‌కు, పోటీకి స‌రిప‌డా ఎమ్మెల్యేల బ‌లం లేక‌పోవ‌డంతో, గుత్తా గెలుపు ఏక‌గ్రీవం కానుంది. ఎమ్మెల్సీ సీటు ఖాయం చేసుకున్న గుత్తాకి, కేసీఆర్ కేబినెట్‌లో కూడా బెర్తు దక్కనుందని తెలుస్తోంది.

అందుకోసం ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రిగా ఉన్న జగదీశ్‌ రెడ్డిని తప్పించి, గుత్తాకి కేబినెట్లో చోటు కల్పిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇంటర్ బోర్డు పరీక్షల అవకతవకల్లో జగదీశ్‌ రెడ్డికి చెడ్డ పేరు వచ్చింది. పైగా ఆయన పనితీరు సరిగాలేదని కేసీఆర్ కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన్ని పక్కనబెట్టి గుత్తాకి చోటు ఇచ్చే అవకాశం ఉంది. ఈ వార్త‌లు లీక్ అవ్వ‌డంతో జ‌గ‌దీశ్‌రెడ్డికి లోలోప‌ల ఆందోళ‌న స్టార్ట్ అయిన‌ట్టు తెలుస్తోంది. అలా కాకుండా నల్గొండలో స్ట్రాంగ్ గా ఉన్న కాంగ్రెస్ ని ఎదురుకోవాలంటే జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటే బెటర్ అనుకుంటే జగదీశ్వర్ రెడ్డితో పాటు గుత్తాని కూడా కేబినెట్ లోకి తీసుకుంటారు. గులాబీ బాస్ ఎలా ప్లాన్ చేసి గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారో ?  చూడాలి.