ప్రపంచాన్ని కబళింప చేస్తుంది కరోనా వైరస్. వారం ముందు అన్ని రోడ్లు ట్రాఫిక్ జనాలతో హడావిడి అలుముకున్న భూమిపై ఇప్పుడు ఎటువంటి చడీచప్పుడు లేకుండా ఉండటం అందరినీ భయాందోళనకు గురి చేసింది. చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం భూమి మీద ఉన్న అన్ని ఖండాలలో వందకు పైగా దేశాలలో వ్యాపించి ఉంది. ఇండియాలో కూడా రోజురోజుకీ కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇటలీలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేయడంతో ఆ దేశమంతా ఇప్పుడు మరణం తాండవం చేస్తుంది.ఇదే విధంగా ఇండియాలో కూడా ఇటలీ పరిస్థితి అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎంత సూచించిన…ప్రజలు బయటకు వచ్చి ఇష్టానుసారంగా తిరగడంతో వైరస్ ఎక్కువగా విస్తరించే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్న గాని కరోనా ని అద్భుతంగా డీల్ చేస్తోంది జర్మనీ దేశం. వ్యాధిని ఇతర దేశాలలో గుర్తించిన వెంటనే…ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ దానికి తగ్గ వైద్య పరికరాలను మరియు పడగలను వైద్య బృందాలను సిద్ధం చేసుకుని రెడీ అయిపోయింది.
దీంతో కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వారిని కూడా ఇతర దేశాలలో పరిస్థితి బట్టి మొదట్లోనే గుర్తించి వైద్యం ప్రారంభించింది. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా సోకిన వ్యక్తితో సంబంధాలు కలిగిన వారిని హైరిస్క్ ప్రాంతాల్లో పర్యటించిన వారిని పరీక్షించింది. అంతేకాదు తొలి వారాల్లో ఈ వైరస్ సోకిన వారి వయస్సు ప్రొఫైల్ ఇతర దేశాల కంటే చిన్నది. వీరు ఫిట్ గా – ఆరోగ్యకరంగా ఉన్నవారు కావడంతో కేసులను చాలా ఈజీగా డీల్ చేసింది. అయితే రాబోయే రోజుల్లో జర్మనీలో మరణాల రేటు పెరిగే అవకాశముందని ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ఆ దేశ ఆరోగ్య మంత్రి తెలిపారు. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుత మరణాల సంఖ్య బట్టి స్టాటిస్టిక్స్ అంచనా వేసి కావలసిన వైద్య పరికరాలను వైద్య బృందాలను మన దేశం కూడా అందుబాటులోకి ఉంచితే ఖచ్చితంగా వైరస్ ని అరికట్టవచ్చని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.