జగన్ ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది   .. అర్రెర్రే ఇప్పుడెలా !!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ దూకుడుగా నిర్ణయాలు సంక్షేమ పథకాలు ప్రజల ముందు మీడియా ముందు ప్రకటిస్తూనే అదే స్పీడ్ లో తర్వాత తీసుకున్న నిర్ణయాలు రద్దయి పోవటం పట్ల ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదే తరుణంలో శాసనమండలిని రద్దు చేయడం ఆ బిల్ కేంద్రం దగ్గర ఉండటం మనందరికీ తెలిసినదే. అయితే ఆ విషయంలో కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో లేదో అన్న టెన్షన్ లో టిడిపి మరియు వైసీపీ పార్టీ నేతలు ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా దిశ చట్టానికి సంబంధించిన బిల్లు కూడా కేంద్రం దృష్టికి వెళ్ళటం..ఆ తర్వాత కేంద్రం మొత్తం పరిశీలించి మార్పులు చేయాలని కోరడం జరిగింది.

Image result for jagan

ఇటువంటి తరుణంలో ఇటీవల దిశ పోలీస్ స్టేషన్ నీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాజమండ్రి లో ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఓపెన్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని తాను అసెంబ్లీ లో ప్రసంగిస్తున్న సందర్భంలో మద్యం గురించి మాట్లాడిన ప్రసంగాన్ని అడ్డంపెట్టుకుని సోషల్ మీడియాలో దారుణమైన విమర్శలు మరియు అసభ్యకరమైన పదజాలంతో కొంతమంది పోకిరి నెటిజన్లు వాడటంతో ఈ విషయంపై టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని దిశా పోలీసుస్టేషన్ కి వెళ్లి కేసు నమోదు చేయాలని భావించిన తరుణంలో పోలీసులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.

 

మేటర్ లోకి వెళ్తే ‘ఇంకా దిశ చట్టానికి కేంద్రం ఆమోద ముద్ర వేయలేదు.. కాబట్టి, ఆ చట్టం కింద కేసు నమోదు చేయలేం’ అని పోలీసులు తేల్చి చెప్పారట. దీంతో ఆదిరెడ్డి భవాని దిశ పోలీస్ స్టేషన్ చట్టం విషయంలో దూకుడుగా జగన్ మీడియా ముందు గొప్పలు చెప్పుకుని..ఇలా వ్యవహరించడం దారుణం అని కామెంట్ చేశారట. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవటంతో..ప్రతి విషయంలో ఇలా జరుగుతుందని కేవలం ఇది గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం తప్ప చేతల్లో ఏమీ లేదనే విమర్శలు రావడంతో…వైసిపి పార్టీ మద్దతుదారులు జగన్ ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది   .. అర్రెర్రే ఇప్పుడెలా ఈ విమర్శలు తిప్పికొట్టాలి అని ఆలోచిస్తున్నారట. 

Read more RELATED
Recommended to you

Latest news