వెంట ఉండి చంద్రబాబు ని దారుణంగా ఇరికిస్తోంది ఆయనేనా ??

చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలలో దారుణంగా ఓటమి పాలు కావడానికి గల కారణాలలో ఒక కారణం ఆయన చుట్టూ ఏర్పరచుకున్న కొంతమంది మనుషులు అంటూ స్వయంగా టిడిపి నేతల కామెంట్ చేశారు. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చాలా దయనీయమైన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తూ అనేక రాజకీయ దాడులు ఎదుర్కొంటున్నారు చంద్రబాబు నాయుడు. Image result for Chandrababu yanamala ramakrishnudu.

ఒకపక్క బలహీనమైన ప్రతిపక్ష స్థితిలో ఉన్నా ఎక్కడా వెనుకడుగు వేయకుండా బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఇటువంటి తరుణంలో చంద్రబాబుని ప్రతిపక్షంలో ఉన్నా గాని ఆయన దగ్గరగా ఉండే మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెంట ఉండి మరీ చంద్రబాబు ని దారుణంగా మిస్ లీడ్ చేస్తున్నారని ఇరికిస్తున్నారని కొంతమంది అంటున్నారు.

 

ముఖ్యంగా శాసన మండలి రద్దు విషయం సెలక్ట్ కమిటీకి అతి ప్రాముఖ్యమైన రెండు బిల్లులను తెలుగుదేశం పార్టీ తరపున శాసనమండలిలో యనమల రామకృష్ణుడు ప్రదర్శించిన రాజకీయ చాణక్యం ఇప్పుడు ఆ పార్టీకి తలనొప్పి తెచ్చిపెట్టినట్లు సొంత నేతలు కామెంట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ పరిస్థితి కి రావటానికి గల కారణం చంద్రబాబు పక్కన యనమల రామకృష్ణుడు ఉండటమే అంటూ టీడీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.