‘రాజు గారి’ కమలం: మోదీ ఎంట్రీ అందుకేనా?

-

దేశంలో బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది…దాదాపు చాలా రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉంది…కాకపోతే బీజేపీకి దక్షిణ భారతదేశంలో ఏ మాత్రం బలం లేదు. ఏదో కర్ణాటకలో మాత్రమే అధికారంలో ఉంది తప్ప…మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ పరిస్తితి ఘోరంగా ఉంది. అయితే దక్షిణాదిలో బలపడాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తుంది…ఈ క్రమంలోనే తెలంగాణపై ఎక్కువ ఫోకస్ పెట్టి రాజకీయం చేస్తుంది…అక్కడ నిదానంగా పార్టీ పుంజుకుంటుంది.

ఇక దక్షిణాదిలో బీజేపీకి దారుణమైన పరిస్తితి ఉంది ఒక్క ఏపీలోనే..ఇక్కడ నోటా కంటే తక్కువ ఓట్లు బీజేపీకి వచ్చాయి. అంటే ఏపీలో బీజేపీ పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ మధ్య బద్వేలు, ఆత్మకూరు ఉపఎన్నికల్లో కాస్త నోటా కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న..డిపాజిట్లు మాత్రం తెచ్చుకోలేకపోయారు. అంటే ఏపీలో బీజేపీకి ఆదరణ లేదనే చెప్పాలి. ఇలాంటి పరిస్తితుల్లోనే బీజేపీ సరికొత్త ఎత్తులతో ముందుకొస్తుంది.

బలమైన సామాజికవర్గాలని తమ వైపు తిప్పుకునే కార్యక్రమాలని చేస్తుంది..ఇప్పటికే పవన్ తో పొత్తు పెట్టుకుని, కాపు సామాజికవర్గం సపోర్ట్ దక్కించుకుంది…ఇదే సమయంలో గోదావరి జిల్లాల్లో కాస్త బలంగా ఉన్న క్షత్రియ సామాజికవర్గాన్ని తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ చూస్తుంది. ఈ క్రమంలోనే మోదీ..భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహం ప్రారంభోత్సవానికి వస్తున్నారు. ఆయన చేతుల మీదుగానే విగ్రహం ప్రారంభం జరగనుంది.

ఇక దీని ద్వారా రాజులని తమ వైపు తిప్పుకోవచ్చనేది బీజేపీ ప్లాన్ గా ఉంది. భీమవరం పట్టణంలో ‘క్షత్రియ పరిషత్‌’ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన అల్లూరి సీతారామరాజు విగ్రహానికి దాదాపు రూ.30 కోట్లు కాగా, ఇందులో 9 కోట్లు కేంద్రం ఇచ్చింది. మోదీ వచ్చి అల్లూరి విగ్రహాన్ని ప్రారంభించే అంశం క్షత్రియ సామాజికవర్గాన్ని బీజేపీకి బాగా దగ్గర చేస్తుందని భావిస్తున్నారు.

పైగా రఘురామకృష్ణంరాజు, అశోక్ గజపతి రాజు లాంటి నేతలపై వైసీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది..ఈ క్రమంలోనే వారికి అండగా నిలబడి క్షత్రియ వర్గాన్ని మరింత దగ్గర చేసుకోవచ్చని చూస్తున్నారు. ఇదిలా ఉంటే నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామ, భీమవరం రావడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు…కానీ జగన్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే బీజేపీ ద్వారా రఘురమ భీమవరం వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికైతే రాజులని దగ్గర చేసుకోవాలనే కమలం ఎత్తులు సఫలం అవుతాయో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news